Published On: Mon, Apr 15th, 2019

దుర్గ‌మ్మ‌కు విరాళంగా వెండి సామాగ్రి బ‌హుక‌ర‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు అమెరికాకు చెందిన కుంచిబొట్ల సూర్యప్రకాశ్, శ్రీరమణి దంపతులు ఆలయంలో పత్రి నిత్యం వాడుక నిమిత్తం 3.75 గ్రాములు బ‌రువున్న వెండి గిన్నెలు, పేట్లు, మూతలు వివిధ (౩ రకాల సైజుల్లో) సుమారు రూ.75 వేలు విలువైన వ‌స్తువుల‌ను ఆల‌య‌ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మకు  విరాళం అందజేశారు. ఈ సంద‌ర్భంగా దాత కుటుంబ‌స‌భ్యుల‌కు అధికారులు అమ్మ‌వారి ద‌ర్శ‌నం చేయించి వేద‌పండితుల‌తో ఆశీర్వ‌చ‌నం ఇప్పించారు. అమ్మ‌వారి చిత్ర‌ప‌టం, ప్ర‌సాదాలు అంద‌జేశారు.

Just In...