Published On: Sun, Oct 25th, 2020

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న మంత్రి వెలంప‌ల్లి

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ రాజరాజేశ్వరి దేవిగా ఆదివారం దసరా ఉత్సవాల చివరి రోజు భక్తులకు బెజవాడ కనకదుర్గమ్మ భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. ఉత్సవాలు చివరి రోజు కావ‌డంతో కొండ‌పైన భ‌క్తులు బారులు తీరారు. ఉదయం 5 గంటల నుండే అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. విజయదశమి రోజు క‌న‌క‌దుర్గ‌ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ‌స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి దేవాదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు ఈఓ ఎం.వి.సురేష్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శనం చేయించి, అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు. అనంతరం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయ‌డం జరిగింద‌న్నారు. అయిన్నప్పటికీ భక్తులు అమ్మవారి దసరా ఉత్సవాలను విజయవంతం చేశార‌ని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కరోనా మహమ్మరిని జయించాలని అమ్మ‌వారిని కోరుకున్న‌ట్లు చెప్పారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అమ్మవారి  పిక్స్‌డ్ డిపాజిట్‌ల‌ను ఖర్చు చేశార‌ని, ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసున్న మారాజు అని వ్యాఖ్యానించారు. అందుకే ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించటంచాలా సంతోషంగా ఉంద‌న్నారు. అమ్మవారి దయతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్న‌ట్లు తెలిపారు. తెప్పోత్సవం వరద ఉదృతి బట్టి నిర్వహించాలని భావించాం అని సమన్వయ అధికారుల కమిటీ నిర్ణయం మేరకు జల విహరం ఈ ఏడాది లేద‌న్నారు. హంస వాహనంపై యధావిధిగా పూజా కార్యక్రమాలు మాత్రం నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించారు.

Just In...