దుర్గమ్మను దర్శించుకున్న హంపి పీఠాధిపతి
ఇంద్రకీలాద్రి, సెల్ఐటి న్యూస్: శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను కర్ణాటకలోని హంపి పీఠాధిపతి విరూపక్ష స్వామి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఈవో ఎం.వి.సురేష్‌బాబు స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి విరూపక్ష స్వామీజీ అమ్మవారిని దర్శనం చేసుకొని, పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు, అర్చకులు స్వామీజీకి వేదస్వస్తి పలికారు. ఈవో సురేష్‌బాబు, ప్రధానార్చకులు స్వామీజీకి అమ్మవారి ప్రసాదాలు, పండ్లు సమర్పించగా, స్వామివారు అందరికీ అనుగ్రహభాషణం చేశారు.