Published On: Sat, May 19th, 2018

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ల‌క్ష విరాళం

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్ర‌కీలాద్రిపై అమ‌లవుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి విజ‌య‌వాడ‌లోని ప‌ట‌మ‌ట ప్రాంతానికి చెందిన అట్లూరి జ‌య‌ప్ర‌దాదేవి రూ.1,00,116లు విరాళం ఇచ్చారు. ఈ మేర‌కు విరాళం చెక్కును ఆలయ కార్యనిర్వహణధికారి డాక్టర్ యమ్.పద్మకు శ‌నివారం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా దాత‌కు ఆల‌య అధికారులు క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పించారు. వేద‌పండితులు ఆశీర్వ‌చ‌నం చేశారు. అనంత‌రం ఆల‌య ఈవో ప‌ద్మ దాత జ‌య‌ప్ర‌దాదేవికి అమ్మ‌వారి చిత్ర‌ప‌టంతో పాటు ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

Just In...