Published On: Mon, Sep 21st, 2020

దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ల‌క్ష విరాళం

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి వార్ల దేవ‌స్థానం ఇంద్ర‌కీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి విజ‌య‌వాడ దుర్గాపురం ప్రాంతానికి చెందిన దాత శిఖాకొల్లి జగదీష్ శ్రీనివాస్‌బాబు రూ.1,01,116, శ్రీమల్లేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి రూ.1,01,116, అమ్మవారి బంగారు గోపురం నిమిత్తం రూ.50,516 విరాళాన్ని ఎస్.అరుణకుమారి, కైలాష్, కార్తికేయ, మీనా అభీష్టా పేరున ఆల‌య ఈవో
ఎం.వి.సురేష్‌బాబుకు చెక్కును సోమ‌వారం అందించారు. ఈ సంద‌ర్భంగా ఆలయ అధికారులు దాత కుటుంబ స‌భ్యుల‌కు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు.

Just In...