Published On: Mon, Sep 14th, 2020

దుర్గ‌మ్మ సేవ‌లో మంత్రులు బొత్స‌, వెలంప‌ల్లి

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమ‌వారం సాయంత్రం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు, పాలకమండలి సభ్యులు చక్కా వెంకట నాగ వరలక్ష్మి, ఎన్‌.సుజాత స్వాగతం పలికారు. మంత్రులు ఇరువురూ  అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదాలు మంత్రుల‌కు అందజేశారు.

Just In...