Published On: Wed, Aug 30th, 2017

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.90 కోట్లు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల ఆదాయాన్ని మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మంగళవారం లెక్కించారు. 34 హుండీల్లో 21 రోజుల్లో వచ్చిన కానుకలను లెక్కించగా రూ.1,90,16,127 ఆదాయం వచ్చింది. అందులో రూ.8,36,927ల చిల్లర నాణేలు ఉన్నాయి. చిల్లర నాణేలను బ్యాంకు సిబ్బంది స్వీకరించి అందుకు సంబంధించి వచ్చే కమిషను కూడా కలిపి బ్యాంకులో అధికారులు డిపాజిట్టు చేశారు. 685 గ్రాముల బంగారం వస్తువులు, 6.430 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు. కరెన్సీ యూఎస్‌ఏ డాలర్లు 475, సింగపూర్‌ డాలర్లు 25, ఓమెన్‌ కరెన్సీ 400, కువైట్‌ దీనార్లు 7, బ్రిటన్‌ పౌండ్స్‌ 10, ఇరాక్‌ దీనార్లు 1000 వచ్చాయి. హుండీల లెక్కింపులో స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, సీనియరు సిటిజన్లు అధిక సంఖ్యలో పాల్గొనడంతో లెక్కింపు మధ్యాహ్నంతో ముగిసింది. లెక్కింపును ఈవో సూర్యకుమారి, పీఆర్వో అచ్యుతరామయ్య, సూపరింటెండెంట్‌ కృష్ణప్రసాద్‌ పర్యవేక్షించారు.

indrakiladri_18-11-16_1

Just In...