Published On: Wed, Jul 22nd, 2020

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.74,03,832

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం ఇంద్ర‌కీలాద్రిపై మహామండపంలో బుధ‌వారం పరిమిత సిబ్బందితో సామాజిక దూరం మరియు ఇతర జాగ్రత్తలు పాటిస్తూ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది, ఎస్‌పిఎఫ్ సిబ్బంది పర్యవేక్షించారు. మొత్తం 35 హుండీల‌ను లెక్కించ‌గా న‌గదు: రూ. 74,03,832, బంగారం: 150 గ్రాములు, వెండి1750 గ్రాములు భ‌క్తులు కానుక‌ల రూపంలో అమ్మ‌వారికి స‌మ‌ర్పించారు.

Just In...