Published On: Fri, Jul 5th, 2019

దూసుకెళ్లిన పసిడి ధర..!

* ఒక్కరోజే రూ. 590 పెరిగిన బంగారం

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ (బిజినెస్ డెస్క్‌): బంగారంపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర అమాంతం పెరిగింది. ఇప్పటికే రూ. 34వేల పైన ఉన్న పుత్తడి ధర.. శుక్రవారం ఒక్కరోజే రూ.590 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.34,800కు చేరినట్లు ఆల్‌ ఇండియా సఫారా అసోసియేషన్‌ వెల్లడించింది. అటు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ. 80 తగ్గడంతో కేజీ వెండి ధర రూ.38,500గా ఉంది. బంగారం, ఇతర లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్ర‌వారం ప్ర‌దేశ‌పెట‌ట్టిన బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతో దేశీయ మార్కెట్‌లో పుత్తడి ధర ఒక్కసారిగా పెరిగిందని బులియన్‌ వర్గాలు తెలిపాయి. అయితే ఇది పసిడి వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపించబోదని మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Just In...