Published On: Thu, Feb 6th, 2020

దేశం మొత్తం ఇప్పుడు మాంద్యాన్ని ఎదుర్కొంటోంది..

* ఏపి స‌చివాల‌యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్‌లో సీఎం జ‌గ‌న్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఎపి సచివాలయంలో స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్ సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న గురువారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి కన్నబాబు *సీఎస్‌ నీలం సాహ్ని, నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.సెల్వరాజ్, నాబార్డ్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌ బెహరా, వివిధ బ్యాంకులకు చెందిన అధికారులు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 2020–21 నాటికి స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ను విడుదలచేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌. 2020–21లో రూ.1,34,402.52 కోట్ల రూపాయలను వ్యవసాయ రుణాలుగా ఫోకస్‌ పేపర్‌లో పేర్కొన్న నాబార్డ్‌. మొత్తంగా ప్రాథమికరంగానికి రూ.2,11,865.38 కోట్ల రూపాయలు రుణాలుగా ఫోకస్‌ పేపర్‌లో పేర్కొన్న నాబార్డ్‌. నాబార్డ్‌ నిర్వహించిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రం వ్యవసాయ  ఆధారిత రాష్ట్రం అన్నారు. 62 శాతం మంది ప్రజలు వ్యవసాయంమీద ఆధారపడి ఉన్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాలకు అపారమైన అవకాశాలున్న రాష్ట్రం:
ఆక్వా, ఫిషరీస్‌ లాంటి వ్యవసాయ అనుబంధ రంగాల్లో నంబర్‌ ఒన్‌గా ఉన్నాం:
దేశం మొత్తం ఇప్పుడు మాంద్యాన్ని ఎదుర్కొంటోంది:
దీని ప్రభావం మొదటగా ప్రాథమిక రంగాలపైనే అంటే వ్యవసాయం పైనే ఆధారపడి ఉంటుంది:
మెజార్టీ సంఖ్యలో ప్రజలకు ఉపాధి కల్పించే ఈ రంగంపైనే దృష్టిపెట్టాలి:
మేం చేపట్టిన పథకాలు… గతంలో ఎక్కడా అమలు చేయలేదు, లేవు :
రైతు భరోసా కింద 46 లక్షలమంది రైతులను ఆదుకున్నాం:
69శాతం మంది రైతులకు ఒక హెక్టార్‌ కన్నా తక్కువ భూమే ఉంది:
సగం హెక్టార్‌ కన్నా ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారు:
వీరికి ఏటా రూ.13500లు రైతు భరోసా కింద అందిస్తున్నాం:
80శాతం వ్యవసాయపెట్టుబడులు సమకూరుస్తున్నాం:
ఇది వారికెంతో ఊరటనిచ్చే అంశం:
వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం :
అలాగే రైతులు కట్టాల్సిన భీమా ప్రీమియంను ప్రభుత్వమే కడుతుంది:
ఆ భారం రైతులమీద లేకుండా చేశాం:
రూ. 3వేల కోట్ల రూపాయలను ధరల స్థిరీకరణ నిధికోసం పెట్టాం:
ఏ రైతు కూడా నష్టపోకుండా ఆదుకోవడానికే ఈ నిధి పెట్టాం:
అన్ని పంటలకూ కనీస మద్దతు ధరలు ప్రకటించాం:
ఈ ధరలకన్నా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఉంటే.. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది:
దీనివల్ల మార్కెట్‌లో పోటీని పెంచేలా, ధరలు పడిపోకుండా చర్యలు తీసుకుంటున్నాం:
ప్రతి 2వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయాన్ని పెట్టాం, 10 మంది ఉద్యోగులు ఇందులో ఉంటారు:
దీనికి పక్కనే సుమారు 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలను పెడుతున్నాం:
ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం:
అగ్రికల్చర్‌ అసిస్టెంట్, హార్టికల్చర్‌ అసిస్టెంట్, ఫిషరీస్‌ అసిస్టెంట్, ఆక్వా అసిస్టెంట్లను ఈ గ్రామ సచివాలయాల్లో పెట్టాం:
వీరు రైతులకు అండగా ఉంటారు, ఉత్తమ యాజమాన్య పద్ధతులపై వారికి తోడుగా ఉంటారు:
రైతులకు మార్గనిర్దేశం చేస్తారు :
అలాగే రైతు భరోసా కేంద్రాల్లో కియోస్క్‌ ఉంటుంది, ఇంటర్నెట్‌ ఉంటుంది, నాణ్యమైన, ప్రభుత్వం పరీక్షించిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్ముతారు:
వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మండలాల వారీగా హబ్‌లను ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తాయి:
ఆర్డర్‌ ఇచ్చి 24–48 గంటల్లోగా రైతులకు కావాల్సినవి అందుతాయి:
అంతేకాదు.. సేకరణ కేంద్రాలుగా కూడా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి:
ఏ పంట వేసుకోవాలన్న దానిపై సలహాలు ఇస్తాయి:
ఎక్కడైనా ధర పడిపోతే.. ఈరైతు భరోసా కేంద్రాల ద్వారా ధరలస్థిరీకరణ నిధితో ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను కాపాడుతుంది:
దీనిపై ఈ ఉదయమే సమీక్ష చేశాను :
వచ్చే ఖరీఫ్‌ నాటికి 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు సిద్ధం అవుతాయి:
అలాగే ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకునేందుకు విపత్తు నిధినికూడా పెట్టాం:
ఈ కార్యక్రమాలకు నాబార్డు సహకారం కావాలి:
ఇప్పటికే కొన్ని కార్యక్రమాల్లో సహకారం అందిస్తున్నారు:
అలాగే అగ్రిలాబ్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం:
దీనికి సహకరిస్తున్నందుకు నాబార్డ్‌కు ధన్యవాదాలు :

రాష్ట్రంలో సరిపడా గోదాములు అందుబాటులో లేవు:
కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను ఉంచడానికి సరైన స్థలం లేదు:
అలాగే కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి ఉంది:
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఫుడ్‌ ప్రాససింగ్‌ జోన్స్‌ పెట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం:
తర్వాత నెమ్మదిగా నియోజకవర్గాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసున్నాం:

రైతులకు కిసాన్‌ క్రెడిట్‌కార్డులు అందాలి:
ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను రైతు భరోసా కేంద్రాలకు లింక్‌ చేసేలా చూడాలి:
దీనివల్ల వ్యవసాయ రంగంలో మంచి ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది:
అలాగే సున్నా వడ్డీకి రుణాలు కూడా అందిస్తున్నాం:
చిన్న చిన్నవ్యాపారాలు చేసుకునేవారికి రుణాలు ఇవ్వాలి:
వీరి మీద పెద్ద మొత్తంలో వడ్డీలు వేస్తున్నారు:
ప్రభుత్వం వైపునుంచి కట్టాల్సిన వడ్డీలు కడతాం:
ఒక్కో నియోజకవర్గంలో కనీసం 5వేలమంది ఉంటారనుకుంటే.. వీరందరికీ క్రెడిట్‌కార్డులు ఇచ్చి… రూ.10వేల చొప్పున రుణాలు అందిస్తే వారికి మంచి జరుగుతుంది:
వీరిని గ్రామ సచివాలయాలకు లేదా స్వయం సహాయ సంఘాలకు లింక్‌ చేయొచ్చు:
మనం సహాయం చేయగలిగితే వారి జీవితాలు మెరుగుపడతాయి:

పోలవరం ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతతో కూడినది:
రాష్ట్రానికి గుండెకాయ లాంటిది, జీవనాడి లాంటిది:
కృష్ణాలో నీళ్లు రావడంలేదు, మరోవైపు గోదావరిలో నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి:
మేం 5వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తే.. దానిపైవడ్డీ సుమారుగా రూ.500 కోట్లకుపైగా కడుతున్నాం:
సకాలానికి డబ్బులు రావడంలేదు:
ఇప్పుడు ఇచ్చిన సుమారు 1800 కోట్లకుపైగా డబ్బులు కూడా నాబార్డు నుంచి పీపీఏకి వెళ్లాయి… అవి ఇంకా రాలేదు:
ఈ సమస్యలను తీర్చేలా.. పూర్తిస్థాయి సహకారం కావాలి:
2021కు కావాలంటే శరవేంగా పనులు పూర్తిచేయాలి:
కనీసం ఏడాదికి రూ.10వేల కోట్ల చొప్పున ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద కావాలి:
సివిల్‌ పనులకోసం ఈ ఏడాదే రూ.6వేల కోట్లు కావాలి:
ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కావాలని కోరుతున్నా:

సదస్సులో వ్యవసాయ శాఖమంత్రి శ్రీ కన్నబాబు:

వ్యవసాయరంగంలో వినూత్న మార్పులను ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు: వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు
వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు:
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్‌ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నాం:
స్టోరేజీ కెపాసిటీని కూడా పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు:
ప్రతి మండలాలకు కనీసం 5వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండాలని కోరుతున్నారు:
కోల్డ్‌ స్టోరేజీలను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలుచేస్తున్నాం:
ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను పెడుతున్నాం:
రైతు భరోసా కేంద్రాలు మా ముఖ్యమంత్రిగారి మానస పుత్రికలు:
దీనికి నాబార్డ్‌ సహకారం అందించాలి:

సదస్సులో ప్రధాన సలహాదారు అజేయ కల్లాం:

గ్రామ సచివాలయాలు పెట్టాం: ప్రధాన సలహాదారు అజేయకల్లాం
ప్రతి గ్రామ సచివాలయంలో 10 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు:
ఈ బలమైన వ్యవస్థను వాడుకోవాలి:
కిసాన్‌క్రెడిట్‌ కార్డుల జారీ ద్వారా ఈ వ్యవస్థను వాడుకుని రైతులకు సులభంగా రుణాలు ఇవ్వొచ్చు:
అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారిని కూడా ఆదుకోవాలి:

నాబార్డ్‌  చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సెల్వరాజ్‌:

రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది:
నవరత్నాల కార్యక్రమాలను చేపడుతోంది:
రైతు భరోసా, వడ్డీలేని రుణాలు ఇతరత్రా కార్యక్రమాలను రైతులకోసం చేపడుతోంది:
ఇవన్నీ కూడా రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే కార్యక్రమాలు:
ధరలస్థిరీకరణ నిధిని, ప్రకృతి వైపరీత్యాల నిధిని పెట్టి రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచింది:
ప్రాథమిక రంగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం:

   

Just In...