Published On: Sat, Apr 4th, 2020

దేశమంతా ఒక్కటవుదాం… కరోనాపైన‌ విజయం సాధిద్దాం..

* ముఖ్యమంత్రి వైయస్ జగన్

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: చెడు మీద మంచి… చీకటి మీద వెలుతురు గెలవాలని… అలాగే కరోనా మీద చేస్తున్న పోరాటంలో మానవాళి విజయం సాధించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిలషించారు. కరోనా మీద చేస్తున్న పోరాటంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలకు అతీతంగా మనమంతా ఒక్కటేనని, మన శత్రువు కరోనా అని చాటి చెపుతూ భారతీయులంతా ఏకమవువుదామని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళ ముంగిట దివ్వెలు, సెల్‌ఫోన్‌ లైట్లను వెలిగించి భారతీయులంతా ఒక్క తాటిమీదకు రావాలన్న ప్రధాని పిలుపునకు మద్దతు పలకాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

Just In...