Published On: Tue, Aug 20th, 2019

దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌…

సెల్ఐటి న్యూస్, దిల్లీ: అఫ్గానిస్థాన్‌ పాస్‌పోర్టులతో పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌ సహా నలుగురు తీవ్రవాదులు గుజరాత్‌ తీరం నుంచి భారత్‌లోకి ప్రవేశించారని దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నెల మొదటి వారంలోనే వారు దేశంలోకి చొరబడినట్లు తమకు కీలక సమాచారం అందిందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించాయి. ఆ నలుగురూ ఏసమయంలోనైనా విధ్వంసక చర్యలకు తెగబడే అవకాశముందని నిఘావర్గాలు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా హై అలెర్ట్‌ ప్రకటించారు.

Just In...