Published On: Wed, Aug 23rd, 2017

దేశ ఆర్థికాభివృద్ధిలో న‌వ‌క‌ల్ప‌నే కీల‌కం..!

* ఇన్నోవేష‌న్ మేనేజ్‌మెంట్ నేష‌న‌ల్ సెమినార్ ముగింపు స‌భలో వ‌క్త‌లు

సెల్ఐటి న్యూస్‌, (మొగ‌ల్రాజ‌పురం) విజ‌య‌వాడ‌: ఏ రంగంలోనైనా ఏకైక ప్ర‌త్యేక‌త క‌ల్గిన ఉత్ప‌త్తుల‌కు ప్ర‌త్యేక గుర్తింపుతో పాటు విలువ‌లు కూడా వ‌స్తాయ‌ని కాన్ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీస్ (సిఐఐ) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఛైర్మ‌న్‌, బెట‌ర్ కాస్టింగ్స్ సీఈవో జె.ఎస్‌.ఆర్‌.కె.ప్ర‌సాద్ అన్నారు. యూజీసీ, స్టార్ట‌ప్ స్విడ్ సౌజ‌న్యంతో పీబీ సిద్ధార్థ క‌ళాశాల సంయుక్తంగా పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రెండురోజుల ఇన్నోవేష‌న్ మేనేజ్‌మెంట్ నేష‌న‌ల్ సెమినార్ ముగింపు స‌భ ఆగ‌స్టు 23న (బుధ‌వారం) జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జె.ఎస్‌.ఆర్‌.కె.ప్ర‌సాద్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో న‌వ‌క‌ల్ప‌న కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని తెలిపారు. ఈ నేప‌ధ్యంలో యువ‌త విభిన్న‌మైన ఆలోచ‌న‌ల‌తో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌స్తే అటువంటి వారికి సీఐఐ మౌలిక స‌దుపాయ‌ల‌తో పాటు ఆర్థిక చేయూత‌ను కూడా అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇటువంటి ప‌రిశ్ర‌మ‌లు, వాటి ఉత్ప‌దన‌ల‌కు, సేవ‌ల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపుతో పాటు విలువ‌లు కూడా స‌మ‌కూరుతాయ‌ని తెలిపారు. విద్యార్థులు సామాజిక కోణంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వినూత్న ఆలోచ‌న‌ల‌తో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు రావాల‌ని సూచించారు. అదేవిధంగా విద్యార్థులు స‌మాజానికి మ‌నోబ‌లంతో కూడిన సేవ‌ల‌ను అందించాల‌ని పిలుపునిచ్చారు. గౌర‌వ అతిథిగా పాల్గొన్న గ్లోక‌ల్ టెక్నాల‌జీ సొల్యూష‌న్స్, అమ‌రావ‌తి బోటింగ్ క్ల‌బ్ సీఈవో త‌రుణ్ కాకానీ మాట్లాడుతూ స్టార్ట‌ప్స్ ప్రాధాన్య‌త‌ను విద్యార్థుల‌కు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థుల‌తో ముఖాముఖీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించి వారి నూత‌న ఆలోచ‌న‌లు తెలుసుకుని ప‌లు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు. పీబీ సిద్ధార్థ క‌ళాశాల డీన్, స‌ద‌స్సు క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ రాజేష్ సి. జంపాల మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల మేధాశ‌క్తిని పెంపొందిస్తూ జ్ఞాన సంప‌ద‌ను అందించేందుకు క‌ళాశాలలో ఏర్పాటు చేసిన అంకుర కేంద్రం, స్టార్ట‌ప్ స్క్విడ్, ఏపీ ఇన్నోవేష‌న్ సొసైటీ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఇటువంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో భాగంగా విద్యార్థుల‌కు స్టార్ట‌ప్ ఆలోచ‌న‌లుపై పోటీలు నిర్వ‌హించి విజేత‌ల‌కు బ‌హుమతులు, ప్ర‌శంసాప‌త్రాల‌ను అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో సిద్ధార్థ అకాడెమీ స‌భ్యురాలు శ‌శిక‌ళ‌, పీబీ సిద్ధార్థ క‌ళాశాల ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్‌, డైరెక్ట‌ర్ వేమూరి బాబూరావు, స్టార్ట‌ప్స్ స్విడ్ ప్ర‌తినిధులు శీలం శ్రీకృష్ణ‌, ప్రెస్ అండ్ మీడియా ఇన్‌ఛార్జ్ డాక్ట‌ర్ ఎండీఎస్ ర‌హెమాన్‌, పెద్ద‌సంఖ్య‌లో అధ్యాప‌కులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ముగింపు స‌భ‌లో కూడా ప‌లువురు అధ్యాప‌కులు, విద్యార్థులు ప‌రిశోధ‌నా ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు.

pb_23-08-17_2 pb_23-08-17_1 pb_23-08-17_5 pb_23-08-17_4 pb_23-08-17_3

Just In...