Published On: Tue, Apr 10th, 2018

దోపిడీకి పాల్పడిన ఇద్దరికి జైలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం:  విజయవాడలో కారులో ఎక్కించుకుని దోపిడీకి పాల్పడిన ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ స్థానిక అదనపు జ్యుడీషియల్‌ మొదటి తరగతి న్యాయమూర్తి జి.ప్రభాకర్‌ సోమవారం తీర్పు చెప్పారని కోర్టు మానిటరింగ్‌ కేసుల ఎస్సై నరసింహారావు తెలిపారు. 2015 ఏప్రిల్‌ ఆరో తేదీన పులిపాటి సురేష్‌బాబు సూర్యాపేట వెళ్లేందుకు విజయవాడలోని కుమ్మరిపాలెం కూడలిలో వేచి ఉన్నారు. అదే సమయంలో కారులో వచ్చిన ఇద్దరు కిరాయికి వెళ్తున్నామని చెప్పి ఆయనను ఎక్కించుకున్నారు. నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామం వద్దకు రాగానే డొంక రోడ్డులోకి తీసుకెళ్లి ఆయన వద్ద బంగారు ఉంగరం, రూ.1500 నగదు దోపిడీ చేశారు. ఆయనను కొట్టి కింద పడేసి వెళ్లిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా అవరపల్లి మండలం మంచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాడోతు శ్రీకాంత్‌రాజు, చిరుమర్తి నరేష్‌లపై నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు శిక్ష, రూ. పది వేలు జరిమానా విధించారు.

Just In...