Published On: Thu, Nov 7th, 2019

ద్విచక్ర వాహనంపై నుండి ఎగిరి పడి మహిళ మృతి…

సెల్ఐటి న్యూస్‌, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామ శివార్లలో ప్రమాద వశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి ఎగిరి పడి మహిళ మృతి చెందింది… మాదాపూర్ వైపు నుండి ద్విచక్ర వాహనం పై తుర్కపల్లి వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు..వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని 108 కు సమాచారం అందించగా 108 చేరుకుని మహిళ మృతి చెందినట్లు గా నిర్ధారించారు..మృతురాలు తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు మమత కొండలు(నర్సింహ) గా గుర్తించిన పోలీసులు.మృతురాలికి 6 సంవత్సరాల బాబు,4 సంవత్సరాల పాప ఉన్నారు.

Just In...