Published On: Wed, Dec 4th, 2019

ద‌ర‌ఖాస్తుల పరిశీల‌న‌కు శాఖాప‌రంగా ప్రత్యేక నోడల్‌ అధికారులు

* హెడ్రోకార్బన్ సెక్టార్లో పెండింగ్ క్లియరెన్సులపై ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సిఎస్ సమీక్ష

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రానికి సంబంధించి హైడ్రోకార్బన్ సెక్టార్లో పెండింగ్ క్లియరెన్సెస్ అంశాలపై సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత పరిశ్రమలు, ఆపరేటింగ్ ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ వివిధ ఆపరేటింగ్ ఏజెన్సీలు క్లియరెన్సెస్ కోసం చేసిన ధరఖాస్తులను పాస్ట్రాక్ విధానంలో పరిశీలించి సకాలంలో క్లియ‌రెన్సెస్ ఇచ్చేందుకు వీలుగా భుగర్భ గనులు, అటవీశాఖల తరుపున ప్రత్యేకంగా ఒక్కో నోడల్‌ అధికారిని నియమించుకుని సకాలంలో క్లియరెన్సులు ఇవ్వాలని సిఎస్ ఆదేశించారు. అదేవిధంగా హెడ్రోకార్బన్ పెండింగ్ క్లియరెన్సెస్ అంశానికి సంబంధించి పలు అంశాలపై స‌మావేశంలో సమీక్షించారు. సమావేశంలో హైడ్రోకార్బన్ సెక్టార్ డైరెక్టర్ జనరల్ డాక్ట‌ర్ బిపి జాయ్, రాష్ట్ర భూగర్భ గనులశాఖ కార్యదర్శి రాంగోపాల్, ఓఎన్జీసీ, వేదాంత లిమిటెడ్, కీర్తీ ఇండస్ట్రీస్, గాంజెస్ జియో రిసోర్సెస్ ప్రవేట్ నిమిటెడ్, పిఇహెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రవేట్ లిమిటెడ్, కైరోస్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Just In...