Published On: Mon, Sep 9th, 2019

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

సెల్ఐటి న్యూస్, తూ.గో: గోదావరిలో మళ్లీ ప్రవాహ ఉధృతి పెరగింది. దీంతో అధికారులు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీ దగ్గర 11.75 అడుగులకు నీటి మట్టం పెరిగింది. దీంతో ఆదివారం 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శబరి నది ఉప్పొంగడంతో విలీన మండలాల్లో రహదారులపైకి వరదనీరు చేరింది. దీంతో చింతూరు, వీఆర్ పురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం మండలాల్లోని 36 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. పాపికొండలు విహారయాత్రను రద్దు చేశారు.

Just In...