Published On: Mon, Nov 20th, 2017

నంది అవార్డుల వ్య‌వ‌హారం ర‌చ్చ‌వుతుంద‌ని అనుకోలేదు

* వ్యూహ క‌మిటీ భేటీలో సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: నంది అవార్డుల వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సోమ‌వారం ఆయన నేతృత్వంలో నిర్వహించిన వ్యూహ కమిటీ భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నంది అవార్డుల వ్యవహారం ఇలా రచ్చ అవుతుందని తాను అనుకోలేదని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవాళ్లమని తెలిపారు. ప్రతి విషయానికి కులం రంగు పులమడం సరైనా పనా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులిచ్చామని చెప్పారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్‌ ప్రజా సంకల్పయాత్ర పేరిట చేపట్టిన పాదయాత్ర గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు. జగన్‌ పాదయాత్రను ప్రజలే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పార్టీ పరంగా స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న అభిప్రాయపడ్డారు. జగన్‌, వైకాపా వాదనలను కోర్టులే పట్టించుకోవడం లేదని, అభివృద్ధికి అడ్డుపడుతూ ఆ పార్టీ వేస్తున్న కేసులు వీగిపోతున్నాయని అన్నారు. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీరియస్‌గా ఉండడం లేదంటూ ఈ సందర్భంగా చంద్రబాబు చురకలంటించారు.

Just In...