Published On: Tue, Aug 3rd, 2021

నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ద్యేయం

* ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

కడప, సెల్ఐటి న్యూస్‌: కడప నగరాన్ని అత్యంత సుందరంగా, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ద్యేయం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. సోమవారం క‌డ‌ప నగరంలోని 29వ డివిజన్‌లో రూ.48 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా అంజాద్ బాషా మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో జిల్లాలో కుంటుపడిన అభివృద్ధి పనులన్నీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పునరుద్ధరణకు నోచుకుంటున్న‌ట్లు తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ పాలనలో కడప జిల్లాతో పాటు కడప నగరం మరింత అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ప్రత్యేకించి క‌డ‌ప నగరాన్ని సుందర నగరంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. అందులో భాగంగా రూ.48 లక్షలతో 29వ డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టి అన్ని డివిజన్లలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరుగుతోందని  చెప్పారు. కార్యక్రమంలో 29వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వాన్ బాషా, ఇంచార్జి జిలానీ బాషా, కార్పొరేటర్ షఫీ, ఎన్.ఆర్.ఐ. ఇలియాస్, అజ్మతుల్లా, కమాల్ బాషా, జఫరుల్లా, మున్నా, మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Just In...