Published On: Thu, Sep 10th, 2020

నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక మలుపు

హైదరాబాద్ క్రైం, సెల్ఐటి న్యూస్‌‌: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. నటి ఆత్మహత్యతో తనకెలాంటి సంబంధం లేదని ఆమె స్నేహితుడు దేవరాజు రెడ్డి వెల్లడించారు. కుటుంబసభ్యులతో పాటు సాయి అనే వ్యక్తి వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశంలో దేవరాజు రెడ్డి వెల్లడించారు. శ్రావణిని హింసించి కొట్టడంతో అవమానం, బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్ 7న తాను, శ్రావణి కలిసి డిన్నర్‌కి వెళ్లామని.. అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణి పై చేయి చేసుకున్నాడని దేవరాజు చెప్పారు. శ్రావణికి సాయి అనే వ్యక్తి గత 5 సంవత్సరాల నుండి పరిచయం ఉందన్నారు. తాను సంవత్సరం క్రితమే శ్రావణికి పరిచయం ఆయన వివరించారు. ‘‘మా నాన్న, అమ్మ చాలా దారుణంగా కొట్టారు. మా తమ్ముడు నన్ను హింసించాడు. సాయి అనే వ్యక్తి రోడ్డుపై జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టాడు. వీళ్ల మొహాలు జీవితంలో చూడదలుచుకోలేదు. నా చావుకు కారణం సాయి అనే వ్యక్తి’’ అంటూ చివరిగా శ్రావణి తనతో చెప్పిందని దేవరాజురెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు.
శ్రావణిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైంది తప్పుడు కేసు అని.. ఈ విషయాన్ని శ్రావణి స్వయంగా ఒప్పుకొందన్నారు. కుటుంబసభ్యులే ఒత్తిడి చేసి ఆ కేసు పెట్టించారని దేవరాజురెడ్డి ఆరోపించారు. శ్రావణి తనను ఇష్టపడిందని.. అందుకే తనకు ఇన్ని సమస్యలు వచ్చాయన్నారు.

Just In...