Published On: Wed, Aug 23rd, 2017

నదులను సంరక్ష‌ణ‌కు దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తాం…

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: నదులను సంరక్షించడానికి దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని ఈశా ఫౌండేషన్ ప్యాన‌ల్ మెంబ‌ర్ వ‌ల్లూరిప‌ల్లి జోగులాంబ అన్నారు. బుధ‌వారం మ‌హాత్మాగాంధీరోడ్డులోని పీవీపీ మాల్ ఎదురుగా ఉన్న మినర్వా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగులాంబ మాట్లాడుతూ నదుల రక్షణ‌ను ఉద్దేశించి సద్గురు మాట్లాడుతూ దేశంలో కృసించిపోతున్న నదులను సంరక్షించడానికి, ప్రజలలో అవగాహన కల్పించడానికి కన్యాకుమారి నుంచి కాశ్మిర్ దాకా 16 రాష్ట్రాల మీదుగా కారు నడుపుతూ ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో భాగంగా 21 ప్రధాన నగరాల్లో కార్యక్రమాలు చేపట్టి విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌లో జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు పాల్గొంటార‌ని తెలిపారు. అలాగే ఈ ఉద్య‌మానికి 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అంగీకారాన్ని తెలిపారని చెప్పారు. ఈ ర్యాలీని మొదట కోయంబత్తూర్ కేంద్ర, అటవీ, వాతావరణ‌ మంత్రి హర్షవర్ధన్ ప్రారంభిస్తారన్నారు. అక్టోబర్ 2న ఈ ర్యాలీ ముగుస్తుందని తెలిపారు. ఈ ఉద్యమంలో భాగంగా 8000980009 నంబర్‌కు మిస్డ్‌కాల్ చేస్తే సమగ్ర సమాచారాన్ని అందిస్తున్నామని వివ‌రించారు. న‌దుల‌ను సంర‌క్షించ‌కుంటే భ‌విష్య‌త్తు ప్ర‌శ్రార్థ‌కంగా మారుతుంద‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఈశా ఫౌండేష‌న్ వాలంటీర్లు పాల్గొన్నారు.

isha_foundation_23-08-17_2 isha_foundation_23-08-17_1

Just In...