Published On: Mon, Sep 11th, 2017

నదులు పట్ల కృతజ్ఞతా భావమే జలసిరికి హారతి

* సీఎం చంద్రబాబు

సెల్ఐటి న్యూస్, అమరావతి: నదుల పట్ల, జలవనరుల పట్ల మనకున్న ఆరాధన, వాటి వల్ల కలిగే ప్రయోజనాలకు కృతజ్ఞతగా ప్రభుత్వం జలసిరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సెప్టెంబరు 7న (గురువారం) ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం శంఖుస్థాపనకు విచ్చేసిన సందర్బంగా తొలుత జలసిరికి హారతి సమర్పించి, మొక్కలు నాటారు. అనంతరం ఎత్తిపోతల పధకం శంఖుస్థాపన గావించి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట భూములకు గోదావరి జలాలు అందిచాలని లక్ష్యంతో చింతలపూడి ఎత్తిపోతల పధకం నిర్మిస్తున్నామని తద్వారా ఈ రెండు జిల్లాలో 9 నియోజక వర్గాలు, 33 మండంలాలో 2 లక్షల ఏకరాలు కొత్తగా సాగులోకి తేవడంతో పాటు 2.80 లక్షల ఏకరాల ఆయుకట్టు స్థీరికరణ జరుగుతుందన్నారు. 200 చెరువులు, 10 లిప్ట్‌లు కింద పరోక్షంగా 35 వేల ఏకరాలకు లబ్ది చేకూరుతుందని, 410 గ్రామాల్లో 21 లక్షల జనాభాకు త్రాగునీరు అందుతుందన్నారు. ఏడాదిలో గోదావరి నీరు చింతలపూడిలో పారే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, ప్లారమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని), కొనకళ్ల నారాయణరావు, మాగంటి వేంకటేశ్వరరావు (బాబు), జిల్లా పరిషత్తు చైర్పర్సన్ గద్దే అనురాధ, శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు, శాసనసభ్యులు పీతల సుజాత, తంగిరాల సౌమ్య, తేదేపా నేతలు వర్ల రామయ్య, నల్లగుంట్ల స్వామిదాసు, జలవనరుల శాఖ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్, జిల్లా కలెక్టర్  బి.లక్ష్మీకాంతం, గ్రామ స్పరంచి కోమటి కృష్ణ,  స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

chintalapudi_inaugration_2 chintalapudi_inaugration_1 chintalapudi_inaugration_14 chintalapudi_inaugration_4 chintalapudi_inaugration_6 chintalapudi_inaugration_3 chintalapudi_inaugration_5 chintalapudi_inaugration_10 chintalapudi_inaugration_9 chintalapudi_inaugration_8 chintalapudi_inaugration_7 chintalapudi_inaugration_13 chintalapudi_inaugration_12 chintalapudi_inaugration_11

Just In...