Published On: Sun, Jun 23rd, 2019

‘నవరత్నాలు’ వైస్‌ ఛైర్మన్‌గా శామ్యూల్

* ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారుగా కూడా ఆయ‌నే

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘నవరత్నాల’ అమలు కోసం ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ మేర‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. న‌వ‌ర‌త్నాల కార్యక్రమం అమలు విషయంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి సలహదారుగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎం.శామ్యూల్‌ నియమితులయ్యారు. ఇక‌పై ఈ కార్యక్రమానికి ఆయన వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా అన్ని శాఖలతో ఆయన సమన్వయం చేయనున్నారు. కేబినెట్‌ ర్యాంక్‌ హోదాలో శామ్యూల్‌ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయనకు నెలకు రూ.2.5లక్షల గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ప్రత్యేక వాహనం, సిబ్బందిని కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు.

Just In...