Published On: Wed, Oct 31st, 2018

నాకు ప్రాణహాని ఉంది

* ప్రజలతో ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి

* జ‌గ‌న్‌పై క‌త్తితో దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సెల్ఐటి న్యూస్‌, విశాఖప‌ట్నం: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌పై విమానాశ్రయంలో దాడి చేసిన నిందితుడు శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రాణ హాని ఉందన్నాడు. ప్రజలతో ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ వేడుకున్నాడు. మంగ‌ళ‌వారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో శ్రీనివాసరావును పోలీసులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విశాఖ విమానాశ్రయం పోలీస్‌ స్టేషన్‌లో సిట్‌ బృందం విచారిస్తున్న సందర్భంలో తన చేతుల్లో, ఛాతిలో నొప్పి ఉందంటూ శ్రీనివాస్‌ అధికారులకు చెప్పడంతో వారు అప్రమత్తమయ్యారు. అతడికి స్థానిక వైద్యుడు దేవుడు బాబుతో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం వైద్యుడి సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలిస్తున్న సందర్భంలో శ్రీనివాసరావు త‌న‌కు ప్రాణహాని ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశాడు.

Just In...