Published On: Tue, Sep 15th, 2020

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత

నల్లగొండ, సెల్ఐటి న్యూస్‌: ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 14 క్రస్టు గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 2,48,266 క్యూసెక్కులుగా, అవుట్ ఫ్లో 2,48,266 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలకు గాను… ప్రస్తుత నీటి నిల్వ 310.8498 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులకు చేరింది.

Just In...