Published On: Sat, Mar 9th, 2019

నాటి నుండి నేటి వ‌ర‌కు జరిగింది ఇదీ…

* ఫిబ్రవరి 19 నుండి జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌ను వివ‌రించిన సీఎం చంద్ర‌బాబు..?
సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: 
* భారత ఎన్నికల అధికారికి అందజేసేందుకు విజయసాయి రెడ్డి ఒక వినతిని తయారుచేశారు.
* ఆ వినతి ద్వారా తెలుగు దేశం పార్టీని, మంత్రులను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అధికారులను మరియు ప్రభుత్వానికి, పార్టీకి సేవలు అందిస్తున్న వారిని టార్గెట్ చేస్తూ వినతిని తయారుచేశారు.
* ఈ వినతితో పాటు కొన్ని అనుబంధాలను కూడా జతపరిచారు. వాటిలో మొదటి పత్రం…
* ‘‘టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్, మోడస్ ఆపరేండి, అఫెన్సెస్ ఇన్వాల్వ్ డ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఐటి గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సోదాలలో చేయవలసిన ఫోకస్ పాయింట్స్ ’’ అనే హెడ్డింగ్‌లతో అనుబంధ పత్రం తయారు చేశారు.
ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో…
* ఒక ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేయించాలి, మరియు స్టోలెన్ డేటా పేరుతో సర్వర్లు సీజ్ చేయాలి
* ఐటి గ్రిడ్,బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ డైరెక్టర్ల మరియు రాష్ట్ర మంత్రుల, అధికారుల, సెల్ ఫోన్లు, ఇ-మెయిల్స్, సీజ్ చేయాలి.
* సేవామిత్ర అప్లికేషన్ పనిచేయకుండా ఆపాలి
* సేవామిత్ర టాప్ లెవల్ ఆర్గనైజర్లను గుర్తించాలి.
* కోర్టు ద్వారా సిబిఐ విచారణ అడగాలి.
* జరిగే ప్రక్రియ మొత్తాన్ని నేషనల్ మీడియాకు ఎక్స్‌పోజ్ చేయాలి.
* సిఈవో, ఉడాయ్‌కు (ఆధార్ చట్టం ప్రకారం) ప్రత్యేక లేఖను, కేసు రిజిస్టర్ చేయమని పంపాలి.
ఐటి గ్రిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సోదాల సమయంలో ఫోకస్ పాయింట్స్…
1. ఆధార్ డేటా బేస్, ఎలక్షన్ కమిషన్ డేటా(కలర్ ఫొటోలతో కూడిన ఓటర్లు అని), వివిధ ప్రభుత్వ పథకాల లబ్దిదారులు డేటా మొత్తం వీరి దగ్గర ఉందని ఎస్టాబ్లిష్ చేయాలి.
2.వివిధ రకాలైన డేటా వాడటం కోసం సాఫ్ట్ వేర్ వాళ్లే క్రియేటెడ్ చేశారని ఎస్టాబ్లిష్ చేయాలి
3.సేవామిత్ర యాప్ కొరకు ఈ డేటా వాడారని ఎస్టాబ్లిష్ చేయాలి. మరియు సర్వర్లను డేటాను సీజ్ చేయడంతో పాటు సేవామిత్ర యాప్ ను పనిచేయకుండా ఆపాలి.
4.ఓటర్లను తొలగించడానికి ప్రత్యేకంగా జాబితా తయారు చేశారని ఎస్టాబ్లిష్ చేయాలి.
5.తెలుగుదేశం పార్టీలోని కొందరికి, మరియు ప్రభుత్వానికి, పై జాబితాను ఐటి గ్రిడ్స్ పంపినట్లుగా ఎస్టాబ్లిష్ చేయాలి.
6.ఐటి గ్రిడ్స్ (అశోక్ దేకవరం ముఖ్యంగా), మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్యులు, నారా లోకేష్, ఇతర అధికారుల మధ్య కాల్ డిటైల్స్ ,ఇ-మెయిల్స్, మెసేజ్ లు, చాట్, వివో ఐపి కాల్స్ (వాయిస్ వోవర్ ఇంటర్ నెట్ ప్రొటోకాల్ )కాల్స్ ద్వారా వీరి మధ్య కమ్యూనికేషన్స్ నడిచినట్లు ఎస్టాబ్లిష్ చేయాలి.
7.ఈ లెటర్ కు అనుబంధంగా సేవామిత్ర స్క్రీన్ షాట్ ను, అశోక్-లోకేష్-రాజేశ్ ఇతరుల ఫొటోలతో పాటుగా కొన్ని ఇతర పేపర్లను జతపరిచారు.
ఫిబ్రవరి 22న ఏం జరిగింది..?
22.02.2019: 
* విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 19న తయారుచేసిన వినతిపత్రాన్ని భారత ఎన్నికల సంఘం అధికారులను కలిసి అనుబంద పత్రాలతో సహా అందించారు. ఈ లేఖ 377/22.2.2019 గా నమోదైంది.
* ఈ లేఖలో తెలుగుదేశం పార్టీ, ముఖ్యులు,సర్వీస్ ప్రొవైడర్లు,అధికారుల  మీద చర్యలు తీసుకోవాలని కోరడంతోపాటు ఐపిసి 120 బి, 379,188 మరియు సెక్షన్ 77 ఆప్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
* ఈ లేఖతో పాటు ‘‘టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర’’ పేరుతో ఉన్న ఆ పత్రాన్ని కూడా అనుబంధంగా ఇచ్చారు.
* పైన పేర్కొన్న విధంగా కేసు బుక్ చేయడానికి ఎన్నికల సంఘం ముందుకు రాక పోవడంతో కుట్రను హైదరాబాద్ నుంచి అమలు చేయడానికి పథకం పన్నారు.
23.02.2019 సాయంత్రం 4.30గం: 
* ఫిబ్రవరి 23న ఐటి గ్రిడ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లోని ఆఫీసుపై సాయంత్రం 4.30గంటలకు తెలంగాణ సైబరాబాద్ పోలీసులు దాడిచేసి అనాధరైజ్డ్ గా ఉద్యోగులను భయభ్రాంతులను చేసి రోజువారీ విధులకు ఆటంకం కలిగించారు. కొంత డేటాను కొన్ని కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను తమతో తీసుకు పోయారు.
* సాయంత్రం 7.00గం కు ఏసిపి మాదాపూర్ తోసహా మరి కొంతమంది పోలీసులు ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో ప్రవేశించి అశోక్‌తో సహా ఇతరుల స్టేట్ మెంట్లను తీసుకుని కొన్ని విలువైన పత్రాలను డేటాను కంప్యూటర్లను ఎటువంటి పంచనామా లేకుండా బలవంతంగా తీసుకెళ్లారు.
* ఐటి గ్రిడ్స్ కార్యాలయంలోని సర్వర్లను ఇతర పరికరాలను మొత్తం పోలీసులు వారితో పాటు వచ్చిన ఇతరులు తమ స్వాధీనంలో ఉంచుకున్నారు.
* ఈ ప్రక్రియ 24వ తేది వరకు కొనసాగింది.
25.02.2019సైబరాబాద్ కమిషనర్ ప్రెస్ మీట్: 
* కొంతమంది పత్రికా విలేకర్లు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్(సజ్జనార్ ) ను కలవగా, తనకు విజయసాయి రెడ్డి ద్వారా కంప్లయింట్ వచ్చిందని, దాని ప్రకారం తెలుగుదేశం పార్టీ, సేవామిత్ర యాప్, ఐటి గ్రిడ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా పై విచారణ చేస్తున్నామని ఇంకా ఎఫ్ ఐఆర్ రిజిస్టర్ చేయలేదని, తమ పోలీసులు ఆ సంస్థ కార్యాలయంలో విచారణ చేస్తున్నారని చెప్పారు
* సైబరాబాద్ పోలీస్ కమిషనర్(తెలంగాణ) చెప్పిన విషయాలను టైమ్స్ ఆప్ ఇండియాలో 26.02.2019న ప్రచురించింది.
02.03.2019(అర్ధరాత్రి 12.15 గం): 
* మార్చి 2న అర్ధరాత్రి 12.15 ని.లకు తుమ్మల లోకేశ్వర రెడ్డి ( వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర బంధువు, తెలంగాణ నివాసి) ద్వారా సైబరాబాద్ పోలీసులు విజయసాయి రెడ్డి లేఖలోని అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన వినతి మేరకు ఎఫ్ ఐఆర్ నెం: 174/ 2019 కింద నమోదు చేశారు. 19.02.2019న విజయసాయి రెడ్డి లేఖలో చెప్పిన అంశాల ప్రకారమే ఈ ఫిర్యాదు ఉండటం గమనార్హం.
03.03.2019 (సాయంత్రం 6.30గం):
* మార్చి 3 సాయంత్రం 6.30గంటలకు హైకోర్టు అశోక్ పిటిషన్ పై విచారించి ఆర్డర్ ఇస్యూ చేసింది. తెలంగాణ పోలీసులు తెల్లకాగితాలపై వీఆర్ వో లతో సంతకాలు చేయించడం, వాళ్ల అధెంటిసిటికి, వాళ్ల ఎంక్వైరీపైన తీవ్ర అనుమానాలు హైకోర్ట్  వ్యక్తం చేసింది.
* 03.03.2019 సాయంత్రం 7.00గం:ఎఫ్ ఐఆర్ నెం. 149/2019 ఎస్ ఆర్ నగర్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.
* 19.2.2019 నాటి విజయసాయి రెడ్డి లేఖలోని అంశాలతో పాటు హైకోర్టు వాదనల్లో వచ్చిన అంశాలను కలిపి జి. దశరథరామిరెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ వింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ) ఇచ్చిన ఫిర్యాదు ద్వారా కేసు రిజిస్టర్ చేశారు.
04.03.2019 (ఉదయం 11.గం): 
* సైబరాబాద్ పోలీస్ కమిషనర్(విసి సజ్జనార్) ప్రెస్ మీట్ లో ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఎక్కడా కూడా 23.2.2019 ఇల్లీగల్ రెయిడ్స్ గురించిగాని, 23న స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు,ఇతర పత్రాల గురించి ప్రస్తావించకుండా, ప్రెస్ నోట్ ఇచ్చారు.
* ఇదే ప్రెస్ నోట్ లో 19.2.2019న విజయసాయి రెడ్డి వినతిపత్రంలో కోరిన విధంగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్ నోట్ లో  ఉడయ్ కి, ఎన్నికల సంఘానికి, ఇతరులనుంచి వివరాలు రాబట్టబోతున్నామని, అవసరమైతే ఎవరినైనా, ఎంతటి వారినైనా అరెస్ట్ చేస్తామని చెప్పారు.(ప్రతి ఛానల్ కు ఇండివిడ్యువల్ ఇంటర్వ్యూలు ఇచ్చారు).
* ఈ ప్రెస్ నోట్ లో 04.03.2019నాటికి ఆంధ్రప్రదేశ్ లో అక్రమ ఓటర్ల తొలగింపుపై 45-50 క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయిన విషయం తనకు తెలుసునని ప్రస్తావించారు.
07.03.2019 సాయంత్రం సిట్ ఛీఫ్ ప్రెస్ మీట్:
* మార్చి 7న సిట్ ఛీఫ్ స్టీఫెన్ రవీంద్ర ప్రెస్‌మీట్‌లో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐటి గ్రిడ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ లో 23.2.2019న సోదాలు చేసినట్లుగా అంగీకరించారు.
08.03.2019 ఢిల్లీ వెళ్లి ఏపి బిజెపి నేతల వినతి:
* ఏపి బిజెపి నేతలు ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం అధికారులకు వినతి. విజయసాయి రెడ్డి ఫిబ్రవరి 19 వినతి అంశాలనే అందులో ప్రస్తావించారు.

Just In...