Published On: Tue, Feb 5th, 2019

నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం

* శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్ ప్ర‌సంగంలో యనమల రామ‌కృష్ణుడు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: శాసనసభలో 11వసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం తనకు గర్వకారణమని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శాసనసభలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సోమ‌వారం ఆయన ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మాట్లాడుతూ అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడుకు అధికారం అప్పగించారన్నారు. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని యనమల పేర్కొన్నారు. చారిత్రాత్మకమైన రాజధాని నగరం ‘మన అమరావతి. ఈ అమరావతిలో వరుసగా 3వబడ్జెట్ పెట్డడం గర్వకారణం. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సవాళ్లను అధిగమించిన తీరు గుర్తు చేసుకుందాం. హేతుబద్దత లేకుండా రాష్ట్రవిభజన జరిగింది. దీనివల్ల రాజధాని నగరాన్ని కోల్పోయాం. ఆదాయ-వ్యయాలను సరిగా పంచలేదు. ఆస్తులు-అప్పులను సరిగా పంపిణీ చేయలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరాశా నిస్పృహలు. గతంలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే రాష్ట్ర ఆర్ధిక మనుగడపై అప్పట్లో భయాందోళనలు ఉండేవి. ఉద్యోగుల జీతాలను చెల్లించలేమనే అనుమానాలు, ఇంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఊహించామా..? వరుసగా రెండంకెల వృద్ధి సాధిస్తుందని ఊహించామా..? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముందంజ అంచనా వేశామా..? పెట్టుబడుల ఆకర్షణలో ముందంజ అంచనావేశామా..? అంతర్జాతీయ నగరంగా అమరావతిని నిర్మిస్తామని కలగన్నామా..? 28,074మంది రైతులు భూములు ఇస్తారని ఊహించామా..? భూముల సమీకరణ విజయవంతం అవుతుందని ఊహించారా..? రాజధానికి 2,28,559మంది విరాళాలు ఇస్తారని ఊహించామా..? పోలవరం డ్యామ్ శరవేగంగా జరుగుతుందని అనుకున్నామా..?  అతిపెద్ద ప్రాజెక్టులలో పోలవరం ఒకటి అవుతుందని ఊహించామా..? నదుల అనుసందానంలో ఏపి మార్గదర్శకం అవుతుందని అనుకున్నారా..? 3ప్రాంతాలలో 3అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి కలగన్నారా..? ఇంత త్వరగా మన గడ్డపైనే మన పాలన అనుకున్నామా, తీవ్ర ఆర్ధికలోటులో ఇంత పెద్దఎత్తున సంక్షేమం ఊహించారా, రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని అనుకున్నారా.? పించన్లు 10రెట్లు చేస్తామని ఊహించామా.? మహిళలకు ‘పసుపు-కుంకుమ’ ఇస్తామని అనుకున్నారా ..? గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కలగన్నారా..? దేశానికే మార్గదర్శక నమూనా ఇస్తామని ఊహించారా..?
అవన్నీ ఈ రోజున సాధించాము. అందరి కలలు నిజం చేశాము. ఎన్నో ప్రతికూలతల నడుమ ఈ విజయాలు గర్వకారణం. ఈ మంత్రిమండలిలో సభ్యుడు కావడం గర్వకారణం. ప్రజలిచ్చిన బాధ్యత చంద్రబాబు భుజాన వేసుకున్నారు. వినమ్రతతతో,అంకితభావంతో పనిచేశారు. సమాజ వికాసం,కుటుంబ వికాసం,సుస్థిర వృద్ధి లక్ష్యాలు ఆర్ధిక అసమానతలపై పూర్తి జాగురూకతతో ఉన్నాం. సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం. తల్లి గర్భంలో నుంచి జీవితాంతం వరకు సంక్షేమం. ప్రతి జీవన దశలో పేదలకు సంక్షేమం. మా ప్రభుత్వ విధానాలు, చర్యలతో సత్ఫలితాలు. అన్నిరంగాలలో వేగవంతమైన అభివృద్ధి. పురుషులతో మహిళలు పోటీపడే సమాజం ఏర్పాటే మా లక్ష్యం,మహిళా సాధికారత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. 20ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాల ఏర్పాటు ‘వెలుగు’ ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలనా కార్యక్రమం. ఈరోజు 94లక్షల మంది మహిళలు అందులో ఉన్నారు. అందులో 17లక్షల మంది ఎస్సీలు, 5లక్షలు ఎస్టీలు, 46లక్షలు బీసిలు,5లక్షలు మైనారిటీలు, 21లక్షలు జనరల్ కేటగిరి, 2014కు ముందు మహిళా సంఘాలపై తీవ్ర ఆర్ధిక ఒత్తిడి, ‘పసుపు-కుంకుమ’ తొలిదశలో రూ.8,604కోట్లు ఇచ్చాం. ప్రతి మహిళకు రూ.10,000 ఇచ్చాం. ‘అన్న’గా ఆడపడుచుల బాధ్యత చంద్రబాబు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఒక్కో మహిళకు మరో రూ.10వేలు, ఫిబ్రవరిలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్ లో రూ.4,000 ఇస్తాం. 93.81లక్షల మందికి రూ.9,381కోట్లు లబ్ది. 20,50,794మంది మహిళలకు రూ.63,283కోట్ల బ్యాంకు లింకేజి. స్త్రీనిధి లబ్దిదారుల సంఖ్య రెట్టింపు చేశాం. స్త్రీనిధి రుణాల మొత్తాన్ని 5రెట్లు పెంచాం. మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.2,514కోట్లు ఇచ్చాం. ఒప్పంద ఉద్యోగులు, పొరుగు సేవల సిబ్బందికి 180రోజుల ప్రసూతి సెలవులు, 1.87లక్షల మంది బాలికలకు సైకిళ్లు ఇచ్చాం. తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో 7.19లక్షల మహిళలకు లబ్ది, 6.91లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబి కిట్స్ అందించాం.

Just In...