Published On: Thu, Feb 14th, 2019

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు

* ద్విచక్ర వాహనాలకు అదనపు బిగింపులు, త‌ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిషిద్ధం

* ర‌వాణాశాఖ అధికారుల త‌నిఖీల్లో 6 బుల్లెట్ వాహనాలు సీజ్‌

* డీటీసీ ఇ.మీరాప్ర‌సాద్ వెల్ల‌డి  

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: రవాణాశాఖ పరిధిలో రిజిస్ట్రేషన్లు చేసుకున్న కొన్ని ద్విచక్ర వాహనాలకు అదనపు బిగింపులు చేయ‌డం ద్వారా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని, అటువంటివి నిషిద్ధమని డిటీసీ ఇ.మీరాప్ర‌సాద్ తెలిపారు. నగరంలో పలుచోట్ల ద్విచక్ర వాహనాలకు అనుసంధానంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తరహాలో వ్యాపారాలు నిర్వహించడం తమ దృష్టికి వచ్చిందని అటువంటి వాహనాలను సీజ్ చేయ‌డంతో పాటు భారీగా జ‌రిమానాలు విధించ‌డం జ‌రుగుతుందని పేర్కొన్నారు. అనుమతులు లేని ఇటువంటి వాహనాలను ఉపయోగిస్తే ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదని మీరాప్రసాద్ స్ప‌ష్టం చేశారు. ఇదే తరహాలో కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలకు గూడ్స్ వాహనాల తరహాలో అదనపు తొట్టెలను ఏర్పాటు చేసుకొని రవాణా వాహనాలుగా తిప్పుతున్నారని ఇటువంటి వాహన యజమానులపైనే కాకుండా తయారీదారులపై కూడా కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని డిటీసీ హెచ్చరించారు. బుల్లెట్ వాహనంతో కంపెనీవారు ఇచ్చే సైలెన్స‌ర్‌లు తొలగించి శ‌బ్ధ కాలుష్యంతో ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల్గిస్తున్నార‌ని అది చట్ట విరుద్ధమని తెలిపారు. నగరంలో ఇటీవల చేపట్టిన ప్రత్యేక తనికీలలో సుమారు 200కుపైగా బుల్లెట్ వాహనాల నుండి అనుమతులు లేని సైలెన్సర్లును వాహన యజమానులతో తొలగించడం జరిగిందన్నారు. భారీగా జ‌రిమానాలు కూడా వసులు చేయ‌డం జిరిగిందన్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం నిర్వ‌హించిన తనిఖీల్లో పట్టుబడ్డ అటువంటి 6 బుల్లెట్ వాహనాలను కూడా సీజ్ చేయ‌డం జరిగిందని డిటీసీ తెలిపారు. కంపెనీతో వచ్చే సైలెన్సర్ మాత్రమే ఉంచాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే ఏ విధమైన సైలెన్సర్లను వాహనాలకు బిగించవద్దని ఆయన కోరారు. తనిఖీల్లో వాహన తనిఖీ అధికారులు రవికుమార్, జయచంద్ర పాల్గొన్నారు.
 

Just In...