Published On: Fri, May 18th, 2018

నిబంధ‌న‌లు పాటించ‌ని బోటు య‌జ‌మానుల‌పై క్రిమిన‌ల్ కేసులు

* టెలీకాన్ఫ‌రెన్స్‌లో కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం హెచ్చ‌రిక‌

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: అనుమతులు లేని, నిబంధనలు పాటించని బోటు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం హెచ్చరించారు. గురువారం ఉదయం కలెక్టర్ లక్ష్మీకాంతం జిల్లాలోని తీర ప్రాంత పరిధిలోని మండల, తాహశిల్దార్లు, ఎంపిడివోలు, రెవెన్యూ, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్, ఆటవీ శాఖ అధికారులతో వాటర్ సేఫ్టీ మరియు బోట్ల సామర్థ్యంపై త‌మ విడిది కార్యాల‌యం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తక్షణం క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తీర ప్రాంతాలలో నడిపే బోట్లకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలన్నారు. అనుమతులు లేకుండా అనధికారికంగా తిరిగే బోట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత బోటు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోట్లను ఉదయం నుండి సాయంత్రం లోపు నిర్ణీత కాలవ్యవధిలోనే నడపాలని, సాయంత్రం 5.30 నిమిషాల తరువాత , చీకటి వేళ్లలో బొట్లను త్రిప్పరాదన్నారు. బోట్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని పేర్కొన్నారు. బోటు నడిపే డ్రైవర్ (సారంగ్)కు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. రెవెన్యూ, పోలీస్, జలవరులు, ఆటవీ శాఖ ఆధికారుల సంయుక్త ఆధ్వర్యంలో బోట్లను తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని కలెక్టర్ హెచ్చరించారు. ” కలెక్టర్ ఆదేశాల మేరకు తీర ప్రాంతాల్లోని మండలాలైన ఇబ్రహీంపట్నం, చందర్లపాడు, నాగాయలంక, నాగాయలంక, కృత్తివెన్ను, తోట్లవల్లూరు మండలాల పరిధిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
 

Just In...