Published On: Mon, Sep 11th, 2017

నిబ‌ద్ద‌త‌కు మారు పేరు సేవాద‌ళ్

* ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్‌లో సేవాద‌ళ్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సేవాద‌ళ్ రాష్ట్ర అధ్య‌క్షులు భ‌వానీ నాగేంద్రప్ర‌సాద్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ: నిబ‌ద్ద‌త‌కు మారుపేరుగా సేవాద‌ళ్ ప‌నిచేస్తుంద‌ని, కాంగ్రెస్‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు, ఎపిలో కాంగ్రెస్ సేవాద‌ళ్‌ను బ‌లోపేతం చేసేందుకు గాను ప‌లు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కాంగ్రెస్ సేవాద‌ళ్ రాష్ట్ర అధ్య‌క్షులు బి.భ‌వానీ నాగేంద్ర ప్ర‌సాద్ పేర్కొన్నారు. సోమ‌వారం ఎపిసిసి రాష్ట్ర కార్యాల‌యంలో సేవాద‌ళ్ ఎపి ఇన్‌చార్జి కె.కె.పాండే జీ ఆధ్వ‌ర్యంలో ఎపి సేవాద‌ళ్ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జరిగాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా భ‌వానీ నాగేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా రాష్ట్ర సేవాద‌ళ్ కాంగ్రెస్ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షించుకున్నామ‌ని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని జ‌రుప‌త‌ల‌పెట్టిన  ట్రైనింగ్ క్యాంప్స్ పై స‌మీక్ష జ‌రిగింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఒక సోష‌ల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని తీర్మానించిన‌ట్లు తెలిపారు. బిజెపి, టీడీపీ ప్ర‌భుత్వాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా తీసుకోరాలేక‌పోవ‌డంపై ప్ర‌తి జిల్లా కేంద్రంలో నిరాహార‌దీక్ష‌లు చేప‌ట్టాల‌ని పిలుపు నిచ్చారు. బిజెపి మ‌రియు టిడిపి ప్ర‌భుత్వాలు ఎన్నిక‌ల‌లో త‌మ మానిఫెస్టోలో పొందుప‌ర్చిన విష‌యాల‌ను విస్మ‌రిస్తున్నాయ‌ని, వీటిపై పోరాటం చేసేందుకు ఎపిసిసి అధ్య‌క్షులు డాక్ట‌న్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలో క్షేత్ర‌స్థాయిలో ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌ను సిద్ధమ‌వుతున్న‌ట్లు  తెలిపారు. సేవాద‌ళ్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో 13 జిల్లాల నుంచి ప్ర‌తినిధులు, సేవాద‌ళ్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు.

congress_11-09-17

Just In...