Published On: Sat, Mar 16th, 2019

నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధిలో ముందంజ‌లో నిలుపుతా

* పాద‌యాత్ర‌లో కోరాడ విజ‌య్‌కుమార్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (భ‌వానీపురం): రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాష్ట్రంలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని ముందంజలో నిలుపుతాన‌ని కోరాడ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ కోరాడ విజ‌య్‌కుమార్ అన్నారు. బీసీ అభ్య‌ర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎన్నిక‌ల బరిలోకి దిగిన ఆయ‌న శ‌నివారం ఉద‌యం, సాయంత్రం 27వ డివిజ‌న్‌లోని భ‌వానీపురంలో ప‌ర్య‌టించారు. స్థానిక యువ‌కులు డి.బ్ర‌హ్మం యాద‌వ్‌, పోతురాజు (పీఆర్‌), వెంక‌టేశ్వ‌ర్లు, మాల‌కొండ‌య్య ఆధ్వ‌ర్యంలో ఎన్టీఆర్ వీధి, బ్యాంక్ సెంట‌ర్ కూడ‌లి, అల్లుడుపేట‌, సాయిబాబా గుడి రోడ్డు, కోళ్లఫారం రోడ్డు, భ‌వానీ ఆసుప‌త్రి రోడ్డు త‌దిత‌ర ప్రాంతాల్లో పాద‌యాత్ర నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డివిజ‌న్‌లో ప్ర‌తి ఇంటికి తిరుగుతూ రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపించాల‌ని, నియోజ‌క‌వ‌ర్గంతో పాటు డివిజ‌న్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఓట్లు వేసి గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా  హైవే విస్త‌ర‌ణ‌పై వ‌స్తున్న ప్ర‌క‌ట‌న‌లు త‌మ‌ను క‌ల‌చివేస్తున్నాయ‌ని, ఏళ్ల త‌ర‌బడి తాము ఇక్క‌డే జీవ‌నం సాగిస్తున్నామ‌ని పేర్కొంటూ ఈ విష‌యంలో త‌మ‌కు అండ‌గా ఉండాల‌ని స్థానికులు విజ‌య‌కుమార్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ సంద‌ర్భంగా కోరాడ విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ 27వ డివిజ‌న్ వాసులు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో జాప్యం జ‌రుగుతున్న కార‌ణంగా అనేక ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు డివిజ‌న్ వాసులు త‌న ఎదుట వాపోయార‌ని తెలిపారు. అలాగే గ‌డ‌చిన నాలుగున్న‌ర ఏళ్లుగా సాగుతున్న దుర్గ‌గుడి పైవంతున ప‌నులు ఇప్ప‌టికీ న‌త్త‌న‌డ‌క‌న సాగుతుండ‌టంతో గ‌ట్టువెనుక ప్రాంతంలో ఉండేవారికి అవ‌స్థ‌లు త‌ప్ప‌డంలేద‌న్నారు. తాను అధికారంలోకి వ‌స్తే గ‌ట్టువెనుక ప్రాంతంలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా ప‌లు అపార్టుమెంట్లు సైతం ఎక్కి ఓట‌ర్ల‌ను ఓట్లు అభ్య‌ర్థించారు. కార్య‌క్ర‌మంలో కోరాడ విజ‌య్‌కుమార్ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.
 

Just In...