Published On: Fri, Mar 20th, 2020

నిర్భ‌య దోషుల‌కు ఉరి శిక్ష అమ‌లు

* శిక్ష నిలుపుద‌ల కోసం క‌డవ‌ర‌కూ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన కామాంధులు

* ఘ‌ట‌న జ‌రిగి 8 ఏళ్ల త‌రువాత దోషుల‌కు అమ‌లైన మ‌ర‌ణ దండ‌న

* తీహార్ జైలు బ‌య‌ట మ‌హిళ‌లు, సామాజిక కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు

ఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో నిర్భయ దోషులకు అధికారులు ఉరి శిక్ష అమలు చేశారు. నిర్భ‌య‌పై హ‌త్యాచారం చేసిన నిందితులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్‌కి తీహార్ జైల్లో శుక్ర‌వారం ఉద‌యం 5:30 గంట‌ల‌కు ఉరి శిక్ష అమలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన పవన్ జలాద్ వారిని ఉరి తీశారు. గురువారం రాత్రి ఉరి శిక్ష అమలు చేసే ప్రాంతాన్ని అధికారులు పక్కాగా పరిశీలించారు. దోషులకు అన్ని, న్యాయ, రాజ్యాంగ అవకాశాలు పూర్తి అయ్యాయి. నిర్భయ ఘటన జరిగిన 8 ఏళ్ళ తర్వాత ఉరి శిక్షను అమలు చేశారు. ఉరి కంభం వద్ద 48 మంది భద్రతా సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. జైలు నెంబర్ 3లో నలుగురు నిందితులను ఉరి తీశారు అధికారులు. ఒక్కో దోషి వద్ద 12 మంది గార్డులు ఉన్నారు. ఉదయం నాలుగు గంటలకు అల్పాహారం పెట్టి, వారికి వైద్య పరిక్షలు నిర్వహించారు. శిక్షకు ముందు వినయ్ శర్మ భోరున విలపించాడు. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు నిందితులు చివరి క్షణం వరకు ప్రయత్నాలు చేశారు. నలుగురు నిందితులను ఒకే సారి ఉరి తీశారు. దీనిపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అర గంట వరకు నిందితులు ఉరి కంభాలకు వేలాడారు. నిందితులను ఉరి తీయడంతో తీహార్ జైలు బయట మహిళలు, సామాజిక కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. నిర్భయ తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళకు తమ కూతురుకు న్యాయం జరిగిందన్నారు. నిందితుల మృత‌దేహాల‌కు శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Just In...