Published On: Thu, Jan 10th, 2019

నిర్మాణంలో తెలుగుజాతికి మించిన వారు లేరు

* జన్మభూమి మా ఊరు వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: వేల కి.మీ సిమెంట్ రోడ్లు వేశారు. మరుగుదొడ్లు కట్టించారు. లక్షలాది ఇళ్లు పేదలకు నిర్మించారు. వేలకోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు.పేదల సంక్షేమానికి లక్ష కోట్లుపైగా ఖర్చు చేశారు. వేలాది గ్రామాల్లో ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. డబ్బులు ఎక్కడివి అన్న దివాకర్ ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వుతూ ‘వయాడక్ట్’ మంత్రం అన్నారు. ముందుచూపు, వినూత్న ఆవిష్కరణలు, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఉబరైజేషన్, కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజి విజయమంత్రంగా తెలిపారు. రూ.22వేల కోట్లతో జలధార కార్యక్రమం చేపట్టాం. ఇంటింటికి తాగునీటి కనెక్షన్ ఇస్తాం. పొరుగు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు రూ.60వేల కోట్లు ఖర్చు చేయగా మన రాష్ట్రంలో రూ.22వేల కోట్లతోనే ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నాం. మరో ఏడాదిన్నరలో అన్ని ఇళ్లకు తాగునీటి సదుపాయం ఏర్పడుతుంది. రాజధాని అమరావతి నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో ఏడాదికి రూ.6వేల కోట్లు వస్తుంది. ఒక్క ఏడాది వచ్చేది కూడా మనకు ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రావడంలేదు. ఇప్పుడు రూ.48వేల కోట్లతో ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆస్తి.ప్రజల రాజధాని. 500ఎకరాలు పేదల ఇళ్ల కోసం కేటాయించాం. 4వేల ఇళ్లు షేర్ వార్న్ టెక్నాలజితో నిర్మించాం. ఒకవైపు పేదలకు ఇళ్లు నిర్మిస్తూనే మరోవైపు ఐకాన్ బిల్డింగులు నిర్మిస్తున్నాం. ప్రపంచంలోని 5అత్యున్నత నగరాల్లో మన అమరావతి ఒకటి కావాలి. నాలుగేళ్లలో  జిఎస్ డిపి 60బిలియన్ డాలర్లు అదనంగా పెరిగింది. రాబోయే 10ఏళ్లలో జిఎస్ డిపి 7% పెరగాలి. ప్రతిఏటా 12% వృద్ధి రేటు సాధించాలన్నదే లక్ష్యం. డబ్బులు సంపాదించడం, సంపద సృష్టించడం తెలుగుజాతికి అతి సులభం. చరిత్రలో రుజువైన సత్యం. నిర్మాణంలో తెలుగుజాతికి మించిన వారు లేరు.

Just In...