Published On: Mon, Nov 5th, 2018

నిర్మాణ రంగంలో అన్ని సేవలు ఒకే వేదికపై లభించటం అభినందనీయం

 ఏపీసీఆర్డీఏ క‌మీష‌న‌ర్ చెరుకూరి శ్రీధర్

* జనవరి 4,5,6 తేదీల్లో క్రెడాయ్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: భవన నిర్మాణ రంగంలో అన్ని సేవలను ఒకే వేదికపై లభించడం అభినందనీయమని ఏపీసీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్‌లో సోమ‌వారం జరిగిన విలేక‌రుల స‌మావేశంలో చెరుకూరి శ్రీధ‌ర్ మాట్లాడుతూ నానాటికీ నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ రంగంలో క్రెడాయ్ ఆధ్వర్యంలో ఒకేచోట బ్యాంకు రుణాలు, నిర్మాణ సామాగ్రి, ఇళ్లు లభించడం ముదావ‌హ‌మ‌న్నారు. సింగిల్ బెడ్ రూమ్ నుంచి విల్లా వరకు ఇక్కడ లభిస్తాయన్నారు. అమరావతి అంటే ఐదు నగరాలు ప్రాంతమని అర్థం అన్నారు. అమరావతిలో నాలుగు నెలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 30 మిలియన్ల స్క్వేర్ ఫీట్స్ చుట్టుపక్కల పరిధిలో ఇంకొక 20 మిలియన్ల స్క్వేర్ ఫీట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. టెక్నాలజీ వల్ల చాలా నిర్మాణం జరుగుతుందన్నారు. వినియోగదారులందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉండాలని కోరారు. అనంతరం క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ జనవరి 4 ,5, 6 తేదీల్లో విజ‌య‌వాడ ల‌బ్బీపేట‌లోని ఏ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతాయని తెలిపారు. క్రెడాయ్ ప్రాపర్టి షో లో భాగంగా 150 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భ‌వన నిర్మాణానికి సంబంధించిన అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి ఉంచినట్లు ఆయన తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా క్రెడాయ్ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయ‌డం ద్వారా  వేలాదిమందికి ఉపయోగకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు అవకాశం ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్రెడాయ్ సంస్థ విజ‌య‌వాడ చాప్ట‌ర్ అధ్య‌క్ష‌, కార్య‌దర్శులు వై.వి.ర‌క‌ణ‌రావు, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Just In...