Published On: Fri, Aug 4th, 2017

నీటిని సాగుకు మాత్రమే వినియోగించాలి

* అధికారుల‌కు కృష్ణా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీకాంతం ఆదేశాలు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ప్రస్తుతం కాల్వలకు వదిలిన నీటిని సాగుకు మాత్రమే వినియోగించాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం అన్నారు. గురువారం నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో నీటియాజమాన్య సంస్థ, డిస్కం, జలవనరులశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతం మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలను దృష్టిలో ఉంచుకుని, సాగుకు మాత్రమే వినియోగించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. చేపల చెరువులకు సాగునీరు మళ్లించకుండా గట్టినిఘా ఉంచాలని సూచించారు. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో నీరు విడుదల చేయకపోవడాన్ని దృష్టిలో ఉంచుకుని పొదుపుగా పంటలకు వినియోగించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు. ఎన్టీఆర్‌ జలసిరిలో భాగంగా లబ్ధిదారుల బోర్లకు విద్యుత్తు కనెక్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు, డ్వామా పీడీ రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

collector_04-08-17

Just In...