Published On: Thu, May 21st, 2020

నెత్తురోడిన హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి

* చిట్యాల సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం ముగ్గురు దుర్మ‌ర‌ణం

చిట్యాల క్రైం, సెల్ఐటి న్యూస్‌: నల్లగొండ జిల్లా పరిధిలోని.. చిట్యాల శివారులో ఎన్‌.హెచ్ 65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగివున్న లారీని వెనక నుంచి ఢీకొన్న ఎర్టీగా కార్ ఢీకొట్టడంతో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయి. క్షతిగాత్రులను సమీపంలోని కామినేని హాస్పిటల్ కి తరలించారు. వీరంతా తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఘటన చోటుచేసుకుంది. మృతులు రాజమండ్రి దగ్గర కొత్తపల్లి చెందిన వారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మృతులను గీత లక్ష్మీ, శ్రీనివాస్, లక్ష్మీచంద్రగా గుర్తించినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాధ్ ఆదేశాలతో.. హైవే వెంబడి.. రాత్రివేళల్లో ఇష్టానుసారంగా వాహనాలు నిలపడంపై పోలీసులు అప్ర‌మ‌త్త‌మైన‌ట్లు తెలుస్తోంది.

Just In...