Published On: Sat, May 4th, 2019

నేటి నుంచి ఎండ ప్ర‌చండం!

* ఆరు జిల్లాల్లో ఎండ‌లు మండిపోతాయి

* తూర్పుగోదావ‌రిలో అత్య‌ధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోద‌య్యే సూచ‌న‌

* 210 మండ‌ల్లాల్లో వ‌డ‌గాల్పుల ప్రమాదం

* చిన్న‌పిల్ల‌లు, వృద్ధులు జాగ్ర‌త్త‌

* ప్ర‌జ‌ల్లో ఎండ‌ల్లో రిగ‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాలి

* ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు ఇదే ప‌రిస్థితి కొన‌సాగే అవ‌కాశం

* ప్ర‌జ‌ల‌కు ఆర్టీజీఎస్ సూచ‌న‌లు

సెల్ఐటి న్యూస్‌, అమరావ‌తి: రాష్ట్రంలో ఆదివారం ఎండ‌లు తీవ్రంగా ఉండబోతున్నాయ‌ని, ప్ర‌జ‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సూచించింది.  రాష్ట్ర వ్యాప్తంగా 210 మండలాల్లో ఆదివారం ఎండ‌లు తీవ్రంగా ఉంటాయి. ప్ర‌జ‌లు ఎండ‌ల్లో ఎక్కువ‌గా తిర‌గ‌కుండా నీడ‌పాటున ఉండాల‌ని సూచించింది. వృద్ధులు, చిన్న‌పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకుని వారు ఎక్కువ‌గా ఎండ‌ల్లో తిర‌గ‌కుండా చూసుకోవాలి.  కోస్తా ఆంధ్రాలోని ప్ర‌ధానంగా ఆరు జిల్లాల్లో ఎండ‌లు ప్ర‌చండంగా ఉండనున్నాయి.  తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణా, గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో క‌నిష్టంగా 43 డిగ్రీల నుంచి అత్య‌ధికంగా 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యే అక‌వాశాలున్నాయ‌ని ఆర్టీజీఎస్‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెథ‌ర్  ఫోర్‌కాస్టింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ రీసెర్చ్ సెంట‌ర్ (అవేర్‌) విభాగం ఈ మేర‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  ఎండ‌ల తీవ్ర‌త ఇలాగే ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆర్టీజీఎస్ తెలిపింది.  ప్ర‌జ‌లు వ‌డ‌గాల్పుల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆర్టీజీఎస్ సూచించింది.
ఉష్ణోగ్ర‌త‌లు అత్య‌ధికంగా 46 డిగ్రీల సెంటీగ్రేడ్ వ‌ర‌కు న‌మోద‌య్యే అవ‌కాశ‌మున్న మండలాలు
తూర్పు గోదావ‌రి..  వ‌ర‌రామచంద్రాపురం, సీతాన‌గ‌రం, కూన‌వ‌రం, దేవీప‌ట్నం
ప‌శ్చిమ గోదావ‌రి:  దెందులూరు, దేవ‌ర‌ప‌ల్లి, ఏలూరు, గోపాల‌పురం, పోల‌వ‌రం, తాళ్ల‌పూడి
కృష్ణా.. 
బాపుల‌పాడు, గుడివాడ, నందివాడ‌, పెద‌పారుపూడి
గుంటూరు.. 
వేమూరు, తాడేప‌ల్లి, పెద‌కాకాని, మంగ‌ళ‌గిరి, గుర‌జాల‌, దాచేప‌ల్లి, రెంట‌చింత‌ల‌
ప్ర‌కాశం.. 
మ‌ద్దిపాడు, కందుకూరు, పొన్న‌లూరు, టంగుటూరు, నూత‌ల‌పాడు, కొండేపి, జ‌రుగుమిల్లి
నెల్లూరు.. 
కావాలి, కొండాపురం, వ‌రికుంట‌పాడు

Just In...