Published On: Mon, Apr 15th, 2019

నేటి నుండి ఇంద్ర‌కీలాద్రిపై చైత్ర‌మాస బ్ర‌హ్మోత్స‌వాలు

* ఐదు రోజుల పాటు నేత్ర‌ప‌ర్వంగా క‌ల్యాణ‌మ‌హోత్స‌వం
* ప‌సుపు కొట్టే కార్య‌క్ర‌మంతో ఉత్స‌వాల‌కు శ్రీకారం..
సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప‌్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్ర‌కీలాద్రిపై సోమ‌వారం నుండి 8 రోజుల పాటు గంగా, పార్వతీ (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల‌ను అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆల‌య కార్యనిర్వ‌హ‌ణాధికారి వ‌ల‌నుకొండ కోటేశ్వ‌ర‌మ్మ తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఆదివారం ఉద‌యం మ‌హామండపంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కోటేశ్వ‌ర‌మ్మ మాట్లాడుతూ శ్రీ వికారి నామ సంవత్సర చైత్ర శుద్ద ఏకాదశి నుండి చైత్ర బహుళ తదియ వరకు నిర్వ‌హించే బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా రోజుకో వాహనంపై నగరోత్సవం (వాహనసేవ) నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయా కార్య‌క్ర‌మ వివ‌రాల‌ను వైదిక క‌మిటీ స‌భ్యులు శివ‌ప్ర‌సాద్ శ‌ర్మ‌, వైదిక క‌మిటీ స‌భ్యులు కోట ప్ర‌సాద్‌ల‌తో క‌లిసి వెల్ల‌డించారు.
* 15-4-2019  చైత్ర శుద్ద ఏకాదశి : ఉదయం 8-30 ని’ లకు శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు మంగళ స్నానములు, వధూవరులుగా అలంకరించుట. సాయంత్రం 4 గంటలకు శ్రీ విఘ్నేశ్వర పూజ, అగ్ని ప్రతిష్టపాన, అఖండ దీపస్ధాపన , కలశారాధన, బలిహరణ జరుగును.
* 16-4-2019 నుండి ది: 19-4-2019 వరకు:  ఉదయం 8 గంటల నుండి  మూల మంత్ర హవనములు, సాయంత్రం 4 గంటల నుండి 6-30 ని’ల వరకు ఔపాసన, బలిహరణ, అనంతరం హారతి, మంత్ర పుష్పము, ప్రసాద వితరణ.
* 17-4-2019 :  రాత్రి 8  గంటల నుండి  రాయబారము (ప్రముఖ కవి పండితులచే) కళ్యాణ వైశిష్ట్యము.  రాత్రి 10-30 ని లకు శ్రీ గంగా, పార్వతీ (దుర్గా) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల దివ్యలీలా కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవోపేతంగా జరుగును. ఉభయ రుసుము రూ.1,116/- లు కళ్యాణం ఉభయ రుసుము టిక్కెట్టు దేవస్ధానము ఆర్జిత సేవా కౌంటరు నఁదు గాని Onlineలో అనగా www.kanakadurgamma.org నందు, మీ సేవ సెంటర్ల నుండి భక్తులు తీసుకొనగలరు.
* 18-4-2019 :  ఉదయం 10 గంటలకు సదస్యము,  వేదస్వస్తి -వేద పండితుల వేదాశీస్సులు.
* 19-4-2019 :  ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి, వసంతోత్సవము, అవభృతస్నానము జరుగును. సాయంత్రం కబలి, ద్వజావరోహణము జరుగును.
* 20-4-2019:  సాయంత్రం  4  గంటల నుండి  సాంస్కృతిక కార్యక్రమములు, ద్వాదశ ప్రదక్షిణలు, శ్రీ మల్లేశ్వర స్వామి వారి పంచహారతులు అనంతరం రాత్రి 9 గంటలకు పవలింపు సేవ (పుష్పయాగ శయనోత్సవము) జరుగును.
* 21-04-2019  మరియు 22-04-2019 రాత్రి 9 గంటలకు పవళింపు సేవ (ఏకాంత సేవలు)
చైత్రమాస బ్రహ్మోత్సవములలో శీ గంగా, పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్లకు రోజుకొక వాహనముపై నగరోత్సవము (వాహనసేవ) శ్రీ మల్లిఖార్జున మహామండపము నుండి జరుగును.
* 15-4-2019   సాయంత్రం 5 గంటలకు నగరోత్సవంలో గజ వాహన సేవ. ది: 16-4-2019  సాయంత్రం 5 గంటలకు  నగరోత్సవంలో రావణ వాహన సేవ.
* 17-4-2019   సాయంత్రం 5 గంటలకు  నగరోత్సవంలో  నందివాహన సేవ.
* 18-4-2019  సాయంత్రం 5 గంటలకు  నగరోత్సవంలో  సింహవాహన సేవ.
* 19-4-2019  సాయంత్రం 5 గంటలకు  నగరోత్సవంలో  వెండి రధం వాహన సేవ.

Just In...