Published On: Tue, Apr 2nd, 2019

నేటి నుండి స్వరాజ్యమైదాన్‌లో.. మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్..

*  చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా ఎమ్యూజ్‌మెంట్ రౌడ్స్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నగరంలోని స్వరాజ్యమైదానంలో బుధ‌వారం నుండి ఈ నెల 15వ తేదీ వరకు మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పి.కృష్ణ, సీహెచ్ అయ్యప్ప తెలిపారు. ఈ విష‌య‌మై స్వరాజ్యమైదానంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వేసవి సెల‌వులు సందర్భంగా పిల్లలకు ఆటవిడుపు కోసం, విజ్ఞానవంతంగా ఉండేందుకు ఎగ్జిబిషన్‌లో పెద్ద ఎత్తున స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధ‌వారం సాయంత్రం నుండి సందర్శకులను అనుమతించనున్నట్లు చెప్పారు.  సుమారు 170 స్టాల్స్ ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా ఫుడ్ కోర్టు, వివిధ రాష్ట్రాలకు చెందిన దుస్తులు, కలంకారీ వస్తువులు, కాటన్ వస్త్రాలు, ప్లాస్టిక్ ఐటెమ్స్, క్రోకరీ ఐటెమ్స్ ఉంటాయన్నారు. చిన్నారులను అలరించేందుకు జెయింటివీల్, కొలంబస్, కప్ అండ్ సాసర్, కమెండో, ట్రైన్, బ్రేక్ డ్యాన్స్ షో, వంటివి ఏర్పాటు చేసినట్లు తెలిపారు చిన్నారులు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆనందంగా.. ఉల్లాసంగా గడిపే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ప్ర‌ద‌ర్శ‌న ఈ నెల 15వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని వెల్ల‌డించారు.

Just In...