Published On: Sat, Mar 16th, 2019

నేడు భాజపా అభ్యర్థుల ప్రకటన!

సెల్ఐటి న్యూస్‌, హైదరాబాద్‌: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను భాజపా ఆదివారం విడుదల చేసే అవకాశం ఉంది. భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమయ్యే సమయంలోనే తొలిదశలో ఎన్నికలు జరగనున్న 91 లోక్‌సభ స్థానాల అభ్యర్థులతో కూడిన జాబితాను భాజపా విడుదల చేయనున్నట్లు స‌మాచారం. ప్రధాని న‌రేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సహా భాజపా నేతలు ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాల్లో భాజపా తరుపున పోటీ చేసే అభ్యర్థులెవరో ఆదివారం తేలనుంది. భాజపాను ఓడించేందుకు పావులు కదుపుతున్నప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిట్టింగ్‌ ఎంపీలనే బరిలోకి దింపే యోచనలో భాజపా ఉన్నట్లు తెలుస్తోంది.

Just In...