Published On: Wed, Sep 18th, 2019

నేడు వెంక‌ట‌గిరి ప‌ట్నంలో పోలేరమ్మ జాతర

* హాజ‌రుకానున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి  

సెల్ఐటి న్యూస్‌, నెల్లూరు: నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్నంలో జరిగే గ్రామ శక్తి పోలేరమ్మ జాతరలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి బుధ‌వారం ప్రకటన విడుదల చేశారు.గు9రువారం ఉదయం విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 9 గంట‌లకు నెల్లూరు చేరుకొని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను వారి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి, నెల్లూరు మీదుగా వెంకటగిరి చేరుకొని ఉదయం 11 గంలకు వెంకటగిరి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. వెంకటగిరి పట్నంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగే గ్రామ శక్తి పోలేరమ్మ జాతరలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం నెల్లూరు నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తిరుగు ప్ర‌యాణం అవుతారు.

Just In...