Published On: Sat, Apr 13th, 2019

నేత్ర‌ప‌ర్వంగా కోదండ‌రాముని క‌ల్యాణం…

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: శ‌్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానం దత్తత దేవలాయం సీతాన‌గ‌రంలోని స్వయంభు శ్రీమద్వీరాంజనేయ సమేత కోదండరామస్వామివారి ఆల‌యంలో శ‌నివారం ఉద‌యం 9 నుండి మధ్యాహ్నం 12 గం.నుండి పవిత్ర కృష్ణాతీరంలో మహిమాన్విత స్వయంభు శ్రీమద్వీరాంజనేయసమేత కోదండరామస్వామి దేవాలయం, సీతానగరం నందు శ్రీరామనవమి కళ్యాణం కన్నులు పండువ‌గా జరిగింది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తజనులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణం వీక్షించారు. వీక్షించి  తీర్ధప్రసాదాలు మరియు అన్నప్రసాదం, అంద‌జేశారు. పూజా కార్య‌క్ర‌మంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోటేశ్వ‌ర‌మ్మ దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

Just In...