Published On: Tue, Sep 25th, 2018

నైపుణ్య శిక్ష‌ణ కోసం ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఏసీ రిపేర్, మెయింటెనెన్స్ విభాగాల్లో నైపుణ్య శిక్షణ కోసం పదవ తరగతి పాసైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) జిల్లా మేనేజర్ ప్రణయ్ మంగ‌ళ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ ఐటిఐల్లో ఎపిఎస్‌ఎస్‌డిసి-హిటాచి ఎయిర్ కండిషనింగ్ సంస్థల ఆధ్వర్యంలో 3 నెలలపాటు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 3వ తేదీలోపు jobskills.apssdc.in/sdc/ వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి. ఈ శిక్షణకు సంబంధించిన మెటీరియల్‌ను హిటాచి ఎయిర్ కండిషనింగ్ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) సంయుక్తంగా రూపొందించాయి. మరిన్ని వివరాల కోసం 8247766718, 9963447166 ఈ నంబర్లలో సంప్రదించవచ్చు.

Just In...