Published On: Wed, Jul 1st, 2020

న్యూ పిడుగురాళ్ళ – శావల్యపురం మధ్య రైళ్ళ రాక‌పోక‌లు..

* నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మితం
విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: న్యూ పిడుగురాళ్ళ – శావల్యాపురం మధ్య 46 కి.మీ. నిడివితో నూతన రైలు మార్గ నిర్మాణం పూర్తయి రైళ్ళు నిర్వహింపబడుతున్నాయి. నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ప్రాజెక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది నిర్మితమైంది. విద్యుదీకరించని ఈ నూతన రైలు మార్గంలో రైళ్లు అనుమంతించిన గరిష్ఠ వేగం గంటకు 80 కి.మీ న్యూ పిడుగురాళ్ళ – శావల్యపురం మధ్య నిర్మించిన నూతన రైలు మార్గం సికింద్రాబాద్ నుండి నల్లపాడు జంక్షన్ నుండి న్యూ పిడుగురాళ్ళ ద్వారా డోన్ వైపు నేరుగా రైళ్ళు నడవడానికి వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు దక్షిణ మధ్య రైల్వే ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు లో ఒకటైన నడికుడి – శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ప్రాజెక్ట్ గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాలలోని మారుమూల ప్రాంతాలకు రైలు అనుసంధానం కల్గిస్తుంది. 2011-12 సం||లో 309 కి.మీ. దూరం నూతన రైలు మార్గం నిర్మాణం కోసం అంచనా వ్యయం రూ. 2289 కోట్లు కాగా, రైల్వే సంస్థతో 50% భాగస్వామ్యంతో పాటు అవసరమైన భూమిని ఉచితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది

ఈ దశల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది..

1వ దశ: పిడుగురాళ్ళ – శావల్యపురం (47 కి.మీ.)

2వ దశ: గుండ్లకమ్మ – దర్శి (27 కి.మీ.)

3వ దశ: దర్శి – కనిగిరి (52 కి.మీ.) మరియు వెంకటగిరి – అట్లూరిపాడు(15 కి.మీ.)

4వ దశ : కనిగిరి – పామూరు (35 కి.మీ.) మరియు అట్లూరిపాడు – వెంకటాపురం (45 కి.మీ.)

5వ దశ: పామూరు – ఓబులంపల్లె – వెంకటాపురం (90 కి.మీ.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు నెట్వర్క్ విస్తరించడం మరియు ప్రస్తుతం కోస్తా తీరం వెంబడి విజయవాడ – చెన్నై మార్గానికి ప్రత్యామ్నాయి రైలు మార్గం రూపొందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ప్రస్తుత రైలు మార్గంలో ట్రాఫిక్ ఎక్కువవడం, కొన్ని సందర్భాల్లో తుఫానులు, వరదల ప్రభావం వల్ల రైళ్ల నిర్వహణ కు ఆటంకం కలుగుతున్నది. ప్రతిపాదిత నూతన రైలు మార్గం కేవలం ప్రత్యామ్నాయ రైలు మార్గం గానే కాక, ఖనిజాలెక్కువగా ఉన్న ప్రాంతానికి సరుకు రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ప్రయాణికుల రవాణాకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే గుంటూరు – దేవస్థాన నగరం తిరుపతికి అతిదగ్గరి మార్గంగా అవతరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కీలకమైన ప్రాజెక్టులో భాగంగా నూతన రైలు మార్గం నిర్మాణం పూర్తిచేయడంలో ముఖ్యభూమికను పోషించిన గుంటూరు డివిజన్ అధికారులు మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అభినందించారు. ఈ ప్రాజెక్ట్ రవాణా రైళ్ళు సాఫీగా సమయానికి నడిచేందుకు అస్తమిస్తుంది తర్వాత ప్రయాణికుల రైళ్ల నిర్వహణ ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రాజెక్ట్ పూర్తి అయ్యేవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అధికారులు, సిబ్బందికి ఆయన సూచించారు.

Just In...