Published On: Sat, Apr 13th, 2019

న‌య‌న మ‌నోహ‌రం.. భ‌క్తుల కోలాహ‌లం..

* నేత్ర‌ప‌ర్వంగా కోదండ‌రాముని క‌ల్యాణం…

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ఆధ్యాత్మికం: శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని కృష్ణ‌లంక పాత పోలీస్‌స్టేష‌న్ రోడ్డులో ఉన్న శ్రీకోదండ‌రామస్వామి వారి దేవస్థానంలో శ‌నివారం ఉద‌యం నిర్వ‌హించిన సీతారాముల క‌ల్యాణం ఆధ్యాంతం నేత్ర‌ప‌ర్వంగా సాగింది.. కృష్ణ‌లంక‌తో పాటు న‌గ‌రం న‌లుమూల‌ల నుండి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చి క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్నారు. ఆల‌య ఈవో పి.రాధాకృష్ణ‌, క‌మిటీ స‌భ్యులు కె.కోటిబాబు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఈ ఉత్స‌వాల‌కు భ‌క్తులు విశేష సంఖ్య‌లో త‌ర‌లివచ్చి స్వామివారిని భ‌క్త‌శ్ర‌ద్ధ‌ల‌తో ఆరాధించారు. అర్చ‌కులు, వేద‌పండితులు శాస్త్రోక్త‌కంగా స్వామివారి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని పూర్తిచేశారు. క‌ల్యాణోత్స‌వంలో భాగంగా శ్రీరాముని ఆద‌ర్శ‌వంత‌మైన జీవితాన్ని అర్చ‌కులు ఈ సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఉప‌దేశించారు. క‌ల్యాణోత్స‌వం అనంత‌రం భ‌క్తుల‌కు తీర్థ‌ప్ర‌సాదాలు, అన‌సంత‌ర్ప‌ణ గావించారు. విశేష సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు.

Just In...