Published On: Sun, Oct 25th, 2020

న‌య‌న మ‌నోహ‌రం… భ‌క్తుల కోలాహ‌లం…!

* ఇంద్ర‌కీలాద్రిపై పోటెత్తిన భ‌క్తులు

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: విజ‌యద‌శ‌మి సంద‌ర్భంగా బెజ‌వాడ ఇంద్ర‌కీలాద్రిపై ‌శ్రీ రాజ‌రాజేశ్వ‌రి దేవిగా కొలువైన జగ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు ఆదివారం ‌రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌‌ర‌లివచ్చారు. సాధార‌ణ భ‌క్తుల‌తో పాటు భ‌వానీలు కూడా పెద్ద సంఖ్య‌లో విచ్చేసి దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు.
భ‌వానీల రాక‌తో జై..భ‌వానీ.. జైజై భ‌వానీ నామ‌స్మ‌ర‌ణ‌తో ఇంద్ర‌కీలాద్రి ప‌రిస‌రాలు మారుమ్రోగాయి. శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి వార్ల దేవ‌స్థానం(శివాల‌యం)లోనూ భ‌క్తుల ర‌ద్దీ నెల‌కొంది. ఆదివారం సెల‌వుదినం కావ‌వ‌డంతో పాటు దసరా ఉత్సవాల చివరి రోజు నేప‌ధ్యంలో భక్తులు పెద్ద సంఖ్య‌లో దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకుని ఈతి బాధ‌లు తొల‌గించాల‌ని వేడుకున్నారు. అధికారులు భవానీల సౌక‌ర్యార్థం ఏర్పాట్లు చేశారు‌.

 

Just In...