Published On: Tue, Nov 27th, 2018

న‌వ్యాంధ్ర సిగ‌లో ఐస్ప్రౌట్ *న‌గ‌*..

* విజ‌యవాడలో ఐస్ప్రౌట్ తొలి బిజినెస్ వ‌ర్క్‌స్పేస్ ప్రారంభం

* లాంఛ‌నంగా ప్రారంభించిన ఇన్నోవేష‌న్ సొసైటీ సీఈఓ విన్నీ పాట్రో 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఐస్ప్రౌట్ ప్ర‌ముఖ వ‌ర్క్ స్పేస్ సంస్థ అత్యాధునిక‌మైన స‌క‌ల సౌక‌ర్యాల‌తో కూడిన‌ త‌న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఆఫీస్ వ‌ర్క్ స్పేస్ స‌దుపాయాల‌ను క‌ల్పించే సంస్థ విజ‌య‌వాడ‌లో తొలి కేంద్రాన్ని ప్రారంభించింది. సుంద‌రి పాటిబండ్ల‌, శేషప్రసాద్, శ్రీ‌నివాస్ తీర్దాల సారథ్యంలో బెంజిస‌ర్కిల్‌లోని జ్యోతి క‌న్వెన్ష‌న్ హాల్ స‌మీపంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని ఏపీ ఇన్నోవేష‌న్ సొసైటీ సీఈవో విన్నీ పాట్రో, ఏపీ హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కాంతిలాల్ దండే ముఖ్య అతిథిగా పాల్గొని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా విన్నీ పాట్రో మాట్లాడుతూ హ్యాపెనింగ్ సిటీగా పేరొందిన విజ‌య‌వాడ‌లో స్టార్ట‌ప్ కంపెనీలు, ఎంట‌ర్‌ప్రైజెస్‌ల‌కు విప‌రీత‌మైన స్థ‌లాభావం ఉన్న నేప‌ధ్యంలో ఆయా సంస్థ‌ల‌కు మేలు చేకూర్చేలా ఐస్ప్రౌట్ తీసుకున్న నిర్ణ‌య అభినంద‌నీయ‌మ‌న్నారు. హైద‌రాబాద్‌లో రెండు ప్ర‌ధాన కేంద్రాల వ్య‌వ‌స్థాప‌కులుగా ఉన్న ఐస్ప్రౌట్ త‌న నూత‌న కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా త్వ‌ర‌లో చెన్నైలో అడుగుపెట్టాల‌నుకోవ‌డం శుభ ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. ఏపీ హౌసింగ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ కాంతిలాల్ దండే మాట్లాడుతూ న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో భాగ‌మైన విజ‌య‌వాడ‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో 12 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో, 200 సీట్ల సామ‌ర్థంతో కూడిన సువిశాల‌మైన ప్రాంగ‌ణంలో ఈ ఫ్రాంజైజీ కేంద్రాన్ని ఐస్ప్రౌట్ ఏర్పాటు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కుల‌ను అభినందించారు. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించే ప్ర‌ణాళిలో భాగంగా పూణే, బెంగ‌ళూరు, గుర్గావ్‌ల‌లో రాబోయే ఆరునెల‌ల కాలంలో ఫ్రాంచైజీ విధానంలో ప్రారంభించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వ‌డం ఐస్ప్రౌట్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నం అన్నారు. సుంద‌రీ పాటిబండ్ల మాట్లాడుతూ విజ‌య‌వాడ‌లో ఆఫీసు స్థ‌లానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఓ వైపు పెరుగుతుంటే మ‌రోవైపు స్థ‌లం త‌క్కువ‌గా అందుబాటులో ఉంద‌న్నారు. మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు. ఈ నేప‌ధ్యంలో ప‌లు స్టార్ట‌ప్ కంపెనీలు మ‌రియు వాటి బ్రాంచ్ ఆఫీసులు త‌మ కార్య‌క‌లాపాల‌ను నివాస ప్రాంగ‌ణాల నుంచి నిర్వ‌హిస్తున్నాయ‌ని ఆ డిమాండ్‌ను ఐస్ప్రౌట్ స‌ద్వినియోగం చేసుకుంటుంద‌ని పేర్కొన్నారు. త‌మ బ్రాండ్ మ‌రియు పోర్ట్‌పోలియోను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ఉంచేందుకు వీలుగా సేవ‌ల‌ను అందిస్తున్నామ‌న్నారు. బిజినెస్ ఇన్ కార్పోరేష‌న్‌, అకౌంటింగ్‌, పేరోల్‌, రిజిస్ట్రేష‌న్స్‌, జీఎస్టీ ఫైలింగ్ టీడీఎస్ ఫైలింగ్‌, ట్యాక్స్ మ‌రియు ఆడిట్ వంటి సేవ‌ల‌ను సైతం అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌యోట‌ర్ల కోరిక మేర‌కు ఆక‌ట్టుకునే వాతావ‌ర‌ణం, ప్ర‌శాంత‌త‌ను చేకూర్చే ఇంటీరియ‌ర్ డిజైన్ల‌ను అతిథులు ప్ర‌త్యేకంగా ప‌రిశీలించి సంతృప్తి వ్య‌క్తం చేశారు.
 

Just In...