Published On: Thu, Sep 7th, 2017

న‌వ‌రాత్రుల్లో దుర్గ‌మ్మ‌కు మొక్కు చెల్లించ‌నున్న కేసీఆర్..!

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్ర‌దేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ ఏర్పడితే మొక్కులు చెల్లించుకుంటానంటూ ఆయన చాలామంది దేవుళ్లు, దేవతలకు మొక్కుకున్నారు. అలా మొక్కుకున్న వారిలో తిరుమల శ్రీనివాసుడు, ఇంద్రకీలాద్రిపై వెల‌సిన క‌న‌క‌దుర్గమ్మ కూడా ఉన్నారు. న‌వ‌రాత్రులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్ర‌మంలో ఇప్పుడు ఆయన కోరిక ఫలించింది. దీంతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడినందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే తిరుమలేశుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ kcr_6ఏడాది ఫిబ్రవరిలో ఆయన తిరుమలలో పర్యటించారు. తిరుమలేశుడికి రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను కేసీఆర్ సమర్పించుకున్నారు. స్వామివారికి 2 హారాలతో పాటు పద్మావతి అమ్మవారికి ఓ ముక్కుపుడకను ఇచ్చి మొక్కు చెల్లించుకున్నారు. అలాగే ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు కూడా ముక్కుపుడక ఇస్తానని గతంలో కేసీఆర్ మొక్కుకున్నారు. ఇప్పుడు ఆమెకు కూడా మొక్కు చెల్లించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 27వ తేదీన కేసీఆర్ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి మొక్కు సమర్పించనున్నట్టు తెలిసింది. దుర్గమ్మకు ముక్కుపుడకతో మరిన్ని కానుకలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వరంగల్ భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ మొక్కు చెల్లించుకున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు చెల్లించే మొక్కు చివరిది. ఈ నెలలోనే ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. అమ్మవారి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30వ తేదీన దసరా పండుగ. అంతకుముందే కేసీఆర్ మొక్కు చెల్లించుకునేందుకు బెజవాడ రానున్నారు. ఆయనకు అధికార లాంఛనాలతో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే అంతకుముందే కేసీఆర్ ఆంధ్రాలో మరోసారి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 16, 17 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Just In...