Published On: Tue, Aug 29th, 2017

పంచదార నిల్వలపై పరిమితులు విధింపు

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: రానున్న పండుగల దృష్ట్యా చక్కెర ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉన్నందున వాటిని నియంత్రణలో ఉంచేందుకు వీలుగా ప్రభుత్వం పంచదార మిల్లుల నిల్వలపై పరిమితి విధించింది. ఈ పరిమితి ప్రకారం సెప్టెంబరు నెలాఖరు లోపు పంచదార మిల్లులు తాము ఉత్పత్తి చేసిన చక్కెరలో 21 శాతం కంటే ఎక్కువ తమ వద్ద నిల్వ ఉంచరాద‌ని పేర్కొంది. అక్టోబరు నాటికి ఈ నిల్వ శాతాన్ని ఎనిమిదికి తగ్గించాలని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి రాంవిలాస్‌ పాశవాన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పండుగలు రానున్న నేపథ్యంలో చక్కెరకు అధిక డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో చక్కెర మిల్లులు మార్కెట్‌లో కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే అవకాశం ఉన్నందున వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

sugar_1

Just In...