Published On: Wed, Dec 4th, 2019

పదోన్నతిపై ఏఎస్పీల హ‌ర్షం..

* సీఎం జగన్‌ను క‌లిసి ధన్యవాదాలు తెలిపిన అధికారులు

 సెల్ఐటి న్యూస్‌, అమరావతి: 2014 నుంచి పెండింగులో ఉన్న తమ ప్రమోషన్లకు అంగీకారం తెలిపి, పదోన్నతి కల్పించినందుకు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు ఏఎస్పీలు ధన్యవాదాలు తెలిపారు. డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు బుధ‌వారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా అన్ని కేటగిరీ అధికారులకు వారి అర్హతల ప్రకారం ప్రమోషన్లు కల్పించారని, ఏఎస్పీలు ముఖ్యమంత్రితో వ్యాఖ్యానించారు. గ‌తంలో కొంతమందికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, ఈసారి పక్షపాతానికి తావులేకుండా అర్హతలున్నవారందరికీ సమాన స్థాయిలో పదోన్నతులు వచ్చాయని ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని ప్రమోషన్లు పొందిన ఏఎస్పీలు ముఖ్యమంత్రితో చెప్పారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

Just In...